ప్రధానాంశాలు

Published : 07/06/2021 15:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IPL 2021: ఐపీఎల్‌ ఫైనల్ ఎప్పుడంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల భారత్‌లో నిర్వహించిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ బయో బుడగలో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో మే 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దాంతో మిగిలిన 31 మ్యాచ్‌లను ఎలాగైనా పూర్తి చేయాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది. అయితే, ఆ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 10లోపు పూర్తిచేయాలని చూస్తున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్‌ 19న టోర్నీని తిరిగి ప్రారంభించి.. అక్టోబర్‌ 15న ఫైనల్‌తో ముగించాలని భావిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు.

ఇందుకు సంబంధించి ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు నిర్వహకులతో పాటు, యూఏఈ అధికారులతో చర్చలు జరిపామని ఆయన అన్నారు. బీసీసీఐ జనరల్‌ మీటింగ్‌కు ముందే యూఏఈలోని మూడు స్టేడియాల్లో మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించుకోవచ్చని ఈసీబీ స్పష్టతనిచ్చిందని, దాంతో ఇప్పుడు మిగిలిన చర్చలు కూడా పూర్తిచేసినట్లు తెలిపారు. మిగిలిన 31 మ్యాచ్‌ల కోసం బీసీసీఐ 25 రోజుల విండో కావాలని ఆశించినట్లు అధికారి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, టోర్నీ మధ్యలో ఆగిపోయేసరికి దిల్లీ క్యాపిటల్స్‌ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి అందరి కన్నా ముందున్న సంగతి తెలిసిందే. తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చెరో 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌ 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. మరి రెండో భాగంలో ఎవరు ఎలా రాణిస్తారో వేచి చూడాలి. ఐపీఎల్‌ కోసం అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net