ప్రధానాంశాలు

Published : 30/09/2020 17:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రిలయన్స్‌ రిటైల్‌లోకి కొనసాగుతున్న పెట్టుబడులు!

0.84శాతం వాటాల కొనుగోలుకు ముందుకు వచ్చిన మరో సంస్థ

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌) అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఆర్‌వీఎల్‌)లోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. మరో అమెరికన్‌ కంపెనీ జనరల్‌ అట్లాంటిక్‌ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆర్‌ఐఎల్‌ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందం విలువ రూ.3,675 కోట్లు. దీంతో ఆర్‌ఆర్‌వీఎల్‌లో జనరల్ అట్లాంటిక్‌కు 0.84 శాతం వాటా దక్కనుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌ మానిటైజేషన్‌ తర్వాత ఆర్‌ఐఎల్‌ రిటైల్‌ వ్యాపారంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే.

ఆర్‌ఆర్‌వీఎల్‌లో దాదాపు 10 శాతం వాటాల్ని విక్రయించేందుకు రియలన్స్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టిన అన్ని సంస్థలకు రిటైల్‌లోనూ అవకాశం కల్పించనున్నట్లు ముకేశ్‌ అంబానీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌వీఎల్‌లో పెట్టుబడుల పెట్టిన మూడో సంస్థ జనరల్ అట్లాంటిక్‌‌. ఇప్పటికే సిల్వర్‌ లేక్‌ 1.75 శాతం వాటా, కేకేఆర్‌ 1.28 శాతం వాటాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకొన్నాయి. ప్రస్తుతం ఆర్‌ఆర్‌వీఎల్‌లో వాటాలు కొనుగోలు చేసిన మూడు సంస్థలూ గతంలో జియో ప్లాట్‌ఫామ్స్‌లోనూ పెట్టుబడి పెట్టడం విశేషం.

భారత్‌లో రిటైల్‌ వ్యాపారంలో ఆర్‌ఆర్‌వీఎల్‌ అత్యంత వేగంగా దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా 12,000 స్టోర్లతో దాదాపు 640 మిలియన్ల వినియోగదారులకు సేవలందిస్తోంది. ఇటీవలే దేశంలో ప్రముఖ రిటైల్‌ సంస్థ ఫ్యూచర్‌ గ్రూప్‌ను రూ.24,713 కోట్లతో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అంతర్జాతీయంగా వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంలో జనరల్‌ అట్లాంటిక్‌కు మంచి పేరుంది.

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net