ప్రధానాంశాలు

Published : 16/06/2021 20:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Tamilnadu: కొవిడ్‌తో మరో సింహం మృతి

చెన్నై: తమిళనాడులోని వండలూర్‌ జూలో కొద్దిరోజుల క్రితం కరోనా లక్షణాలతో ఓ సింహం మృతిచెందగా.. అదే జూలో తాజాగా మరో సింహం కరోనాతో మృతిచెందడం కలకలం రేపింది. జూలోని పద్మనాథన్‌ అనే 12 ఏళ్ల సింహం కొవిడ్‌తో ప్రాణాలు విడిచింది. జూన్‌ 3న ఆ సింహానికి కొవిడ్‌ సోకిందని, చికిత్స అందిస్తున్న క్రమంలో బుధవారం ఉదయం 10.15 గంటలకు మృతిచెందినట్లు జూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ‘అనారోగ్యంతో ఉన్న ఆ సింహం నుంచి సేకరించిన నమూనాను భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్‌ సెంటర్‌ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)కు పంపించాం. కాగా ఆ సింహానికి కరోనా సోకినట్లు జూన్‌ 6న ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ వెల్లడించింది. అప్పటి నుంచి దానికి వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నాం’ అని ఆ ప్రకటనలో వెల్లడించారు. 

కొవిడ్‌తో మృతిచెందిన రెండో సింహం ఇది. జూన్‌ 3న తొమ్మిదేళ్ల మగ సింహం కొవిడ్‌ లక్షణాలతో మరణించింది. దీంతో ఆ జూలో ఉన్న మరో 11 సింహాల నమూనాలను సేకరించి ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీకు తరలించగా వాటిలో తొమ్మిదింటికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ జూ వద్దకు చేరుకొని పరిస్థితులను సమీక్షించారు. సింహాలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net