ప్రధానాంశాలు

Published : 06/05/2021 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IPL Postpone: మాల్దీవులకు ఆస్ట్రేలియా క్రికెటర్లు 

అక్కడికి చేరుకున్నారని స్పష్టం చేసిన సీఏ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ నిరవధికంగా వాయిదా పడటంతో అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్లు తమ స్వస్థలాలకు బయలుదేరారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాల్దీవులకు వెళ్లారు. భారత్‌ నుంచి సాగే రాకపోకలను ఆస్ట్రేలియా ప్రభుత్వం మే 15వరకు తాత్కాలికంగా నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా ఆటగాళ్లు, ఇతర సిబ్బందిని మాల్దీవులకు తరలించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా కాసేపటి క్రితం ఓ ట్వీట్‌ చేసింది.

‘ఐపీఎల్‌తో సంబంధమున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కోచ్‌లు, వ్యాఖ్యాతలు, ఇతర సిబ్బంది అందర్నీ క్షేమంగా మాల్దీవులకు తరలించాము. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ధ్రువీకరిస్తోంది. భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు తాత్కాలికంగా విధించిన ప్రయాణ ఆంక్షలు సడలించేవరకు వారంతా అక్కడే ఉంటారు. ఇంతకుముందు చెప్పినట్లే మా ఆటగాళ్లకు మినహాయింపు ఇవ్వాలని ఇక్కడి ప్రభుత్వాన్ని మేం కోరము’ అని సీఏ పేర్కొంది.

‘అలాగే ఐపీఎల్‌ను వాయిదా వేయాలని నిర్ణయించిన రెండు రోజుల్లోనే బీసీసీఐ మా ఆటగాళ్లందర్నీ మాల్దీవులకు తరలించేందుకు విశేష కృషి చేసింది. ఇంత త్వరగా స్పందించినందుకు భారత క్రికెట్‌ బోర్డుకు ధన్యవాదాలు. మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సిబ్బంది మైక్‌హస్సీకి కరోనా పాజిటివ్‌గా తేలడంతో భారత్‌లోనే ఉంటాడు. ప్రస్తుతం అతడికి స్వల్ప లక్షణాలున్నాయి. దాంతో సీఎస్కే పర్యవేక్షణలోనే ఉన్నాడు. వీలైనంత త్వరగా మైక్‌ పూర్తి ఆరోగ్యంగా ఆస్ట్రేలియాకు చేరుకునే విషయంపై బీసీసీఐతో కలిసి పనిచేస్తాము’ అని సీఏ ఆ ప్రకటనలో రాసుకొచ్చింది. కాగా, ఈవారం మొదట్లో పలు ఫ్రాంఛైజీల ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడటంతో మిగిలిన సీజన్‌ను నిరవధింకగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net