ప్రధానాంశాలు

Published : 18/06/2021 14:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Delhi: ఈ తీరుతో త్వరలోనే ‘మూడో’ ముప్పు..!

కొవిడ్ నిబంధనల ఉల్లంఘనపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తీరు మూడో దఫా కరోనా వైరస్ విజృంభణను వేగవంతం చేస్తుందని హెచ్చరించింది. నగరంలో మహమ్మారి ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో అక్కడి ప్రభుత్వం దశలవారీగా సడలింపులు ప్రకటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్కెట్లలో నిబంధనల ఉల్లంఘనలపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. అలాగే దుకాణదారులకు పరిస్థితి తీవ్రతను వివరించాలని ఆదేశించింది.

కరోనా రెండోదశతో ఉక్కిరిబిక్కిరి అయిన దిల్లీలో మేలో భారీగా మరణాలు సంభవించాయి. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత వేధించింది. మార్చురీలు నిండిపోగా.. శ్మశానాల్లో అంత్యక్రియల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఆంక్షల సడలింపులతో ప్రజలు అవన్నీ మరచినట్లున్నారని ఇప్పటికే పలువురు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా మార్కెట్లు, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్ల వద్ద ప్రజలు గుమిగూడుతున్న దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి.

మరోపక్క కొవిడ్ మూడోదఫా విజృంభణకు సిద్ధమవుతున్నట్లు ఇటీవల దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఒక్కరోజే 37 వేల కేసులు నమోదవుతాయనే అంచనాతో ఐసీయూ పడకలు, ఔషధాలను సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. రెండోదశలో గరిష్ఠంగా 28వేల కొత్తకేసులొచ్చాయి. గురువారం అక్కడ 158 కొత్త కేసులు..10 మరణాలు సంభవించాయి. పాజిటివిటీరేటు 0.20 శాతానికి పడిపోయింది. గతంలో  ఒక దశలో అది 36 శాతానికి చేరింది. దాంతో వైరస్ ఉద్ధృతిని కట్టడి చేసేందుకు ఏప్రిల్ 19న కేజ్రీవాల్ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net