ప్రధానాంశాలు

Published : 06/05/2021 19:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Bumrah: రోజూ హృదయాన్ని దోచుకుంటోందట

సతీమణికి కవితాత్మకంగా పేసుగుర్రం శుభాకాంక్షలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా కవిగా మారాడు! కవిత్వం చెబుతున్నాడు! ఎందుకంటారా? గురువారం అతడి సతీమణి సంజనా గణేశన్‌ పుట్టిన రోజు మరి. అందుకే ఆమె మనసు మురిపించేలా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు.

సంజన తనకు ముద్దు పెడుతున్న చిత్రాన్ని బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘రోజూ నా హృదయాన్ని దోచుకుంటున్న వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నా దానివి. ఐ లవ్యూ’ అంటూ సతీమణిపై ప్రేమ బాణం ఎక్కు పెట్టాడు. ఈ ఏడాది మార్చి 15న వీరిద్దరూ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సన్నిహితుల మధ్య గోవాలో వీరి వివాహం వైభవంగా జరిగింది. స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ అయిన సంజన, బుమ్రా కొన్నాళ్లు ప్రేమాయణం కొనసాగించాక వివాహం చేసుకున్నాడు.

నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌ తాజా సీజన్లో బుమ్రా అంచనాల మేరకు రాణించలేదు. 7 మ్యాచులాడి 6 వికెట్లే తీశాడు. సగటు 32, ఎకానమీ 7.11గా ఉంది. గత ఐదేళ్లతో పోలిస్తే అతడి గణాంకాలు ఈసారి మెరుగ్గా లేవు. బహుశా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడమే కారణం కావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. వివాహం కోసం అతడు ఇంగ్లాండ్‌ సిరీస్‌కు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే.


COhWWGJnl8z

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net