ప్రధానాంశాలు

Published : 18/05/2021 18:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Ball Tampering: కొత్తగా చెప్పడానికేం లేదు

యూటర్న్‌ తీసుకున్న బాన్‌క్రాఫ్ట్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ ‘బాల్‌ టాంపరింగ్‌’ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల అతడు ఓ అంతర్జాతీయ పత్రికతో మాట్లాడుతూ ఆ మ్యాచ్‌ జరిగేటప్పుడు తమ బౌలర్లకు కూడా టాంపరింగ్‌ గురించి తెలుసని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆ ఉదంతంపై మరోసారి విచారణకు ఆదేశించింది. ఇతర ఆటగాళ్లకు నాటి సంఘటనపై ఏదైనా కొత్త సమాచారం ఉంటే తెలియజేయాలని కోరింది. అయితే, బాన్‌క్రాస్ట్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల వెనకడుగు వేసినట్లు తాజాగా రుజువైంది.

ఆ ఉదంతంపై క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏర్పాటు చేసిన విచారణ బృందం సోమవారం బాన్‌క్రాఫ్ట్‌ను సంప్రదించగా తన వ్యాఖ్యల పట్ల యూటర్న్‌ తీసుకున్నాడని ఓ ఆస్ట్రేలియా పత్రిక పేర్కొంది. ఆ వివాదాన్ని ఇంతటితో ముగించాలనే ఉద్దేశంతో బాల్‌ టాంపరింగ్‌కు సంబంధించి కొత్త సమాచారం ఏమీ లేదని చెప్పాడని రాసింది. మరోవైపు తమ బౌలర్లకు కూడా దాని గురించి ముందే తెలుసనే వ్యాఖ్యలపై ఆయా బౌలర్లతో అతడు మాట్లాడినట్లు వివరించింది. ఒక అంతర్జాతీయ పత్రిక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ ప్రశ్నలకు కంగారులో అలా చెప్పానని బాన్‌క్రాఫ్ట్‌ వారితో అన్నాడని తెలిపింది. కాగా, ఆ మ్యాచ్‌లో మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, మిచెల్ మార్ష్‌తో పాటు స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌ ఉన్నారు. కాగా, ఆ ఉదంతంలో భాగమైన కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ అప్పుడు ఏడాది పాటు నిషేధించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net