ప్రధానాంశాలు

Published : 29/04/2021 12:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IPL 2021: ‘ప్రజలను సంతోషపెట్టడమే మా బాధ్యత’

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో ప్రస్తుతం కరోనా రెండో దశ ఉగ్రరూపం దాల్చడంతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర సమయంలో ప్రజల జీవితాల్లో ఐపీఎల్‌ కాస్తయిన ఆనందాన్ని నింపగలదని రాజస్థాన్‌ రాయల్స్ ఆల్‌రౌండర్‌ క్రిస్ మోరిస్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

‘‘భారతదేశంలోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లోనే కొవిడ్ వ్యాప్తి ఎందుకు ఎక్కువగా ఉంటుందో అనే అంశంపై జట్టు సభ్యులందరం చర్చించుకొన్నాం. కరోనా నియంత్రణకు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్ చేస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు 24 గంటలు కృషి చేస్తున్నారు. ఇది గొప్ప విషయం. ఒక జట్టుగా ప్రపంచంలోని ప్రతి ఒక్కరి బాధ మాకు తెలుసు. బయట ఏం జరగుతుందో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. మా ముఖాల్లో చిరునవ్వుకు కారణమైన వారి కోసం ఆడి.. వాళ్ల ముఖాల్లో కూడా చిరునవ్వు ఉండేలా చూడటం మా బాధ్యత’’ అని మోరిస్‌ అన్నాడు.

‘‘మేం గెలిచినా, ఓడినా మా ఆటను చూసిన ప్రజలకు అది కాస్తయిన ఉపశమనం ఇస్తే చాలు. కరోనా వారియర్స్‌కి, కొవిడ్ బాధితులకు రాజస్థాన్‌ రాయల్స్‌ అండగా ఉంటుంది’’ అని క్రిస్ మోరిస్‌ పేర్కొన్నాడు.

శనివారం రాత్రి వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడగా.. కోల్‌కతాపై రాజస్థాన్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాయల్స్ విజయంలో క్రిస్‌ మోరిస్‌(4/23) కీలక పాత్ర పోషించాడు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net