ప్రధానాంశాలు

Published : 10/05/2021 16:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Covid Relief: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ విరాళం

ఇంటర్నెట్ డెస్క్‌: కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న యుద్ధంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ భారీ విరాళాన్ని ప్రకటించింది.  కొవిడ్ 19 కట్టడికి తన వంతు సాయంగా  రూ.30 కోట్ల విరాళాన్ని అందజేయనున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్‌ తెలిపింది. ఈ విషయాన్ని సన్‌రైజర్స్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

‘రెండో దశ కరోనా ఉద్ధృతి వల్ల ప్రభావితమైన వారికి అండగా ఉండేందుకు  రూ.30 కోట్లను సన్‌ టీవీ నెట్‌వర్క్‌ విరాళంగా ఇస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు ఈ నిధులను వెచ్చించానున్నాం. ఆక్సిజన్‌ సిలిండర్లు, ఔషధాల సరఫరాలో  ఎన్జీవోలతో భాగస్వాములు అవుతాం.   కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కారక్యక్రమాలు చేపడతాం’ అని సన్‌రైజర్స్ ట్విటర్‌లో పేర్కొంది.


 

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net