ప్రధానాంశాలు

Published : 03/05/2021 17:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
CSK బౌలింగ్‌ కోచ్, దిల్లీ మైదానం సిబ్బందికి కరోనా

మంగళవారం మ్యాచుపై సందిగ్ధం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు అడ్డంకులు తప్పేలా లేవు. కరోనా మహమ్మారి నిర్వాహక బృందానికి సమస్యలు తెస్తోంది. ఇప్పటికే కోల్‌కతా ఆటగాళ్లు సందీప్‌ వారియర్‌, వరుణ్ చక్రవర్తికి వైరస్‌ సోకిన సంగతి తెలిసిందే. తాజాగా చెన్నైసూపర్‌కింగ్స్‌ క్రికెటేతర సిబ్బంది ముగ్గురు, దిల్లీ మైదానం సిబ్బంది ఐదుగురికి పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగిస్తోంది.

సీజన్‌ ఆరంభంలో ముంబయి మైదానం సిబ్బంది పదుల సంఖ్యలో వైరస్‌ బారిన పడ్డారు.  అక్షర్‌ పటేల్‌, నితీశ్‌ రాణా వంటి ఆటగాళ్లూ పాజిటివ్‌గా తేలారు. అయినప్పటికీ ఐపీఎల్‌ పాలక మండలి టోర్నీని కొనసాగించేందుకే మొగ్గు చూపింది. ఇప్పటికే సగం టోర్నీ ముగియగా.. బయో బుడగ పటిష్ఠంగానే ఉండటంతో బోర్డు ఊపిరి పీల్చుకుంది.

ఎప్పుడైతే చెన్నై సీఈవో కాశీ విశ్వనాథన్‌, బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ, ఓ బస్సు క్లీనర్‌, కోల్‌కతా ఆటగాళ్లకు వైరస్‌ సోకిందో బోర్డులో మళ్లీ ఆందోళన మొదలైంది. సోమవారం జరగాల్సిన కేకేఆర్‌, ఆర్‌సీబీ మ్యాచును వాయిదా వేసింది. ఇక మంగళవారం జరిగే సన్‌రైజర్స్‌, ముంబయి మ్యాచుపైనా సందిగ్ధం నెలకొంది. మైదానం సిబ్బంది ఐదుగురికి వైరస్‌ సోకడమే ఇందుకు కారణం. రాజస్థాన్‌, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై మే 8 వరకు దిల్లీలోనే ఉండనున్నాయి. కఠిన ఆంక్షలు, వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో ఆసీస్‌ ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు దేశం విడిచి వెళ్తున్న సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net