ప్రధానాంశాలు

Published : 28/05/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
David: వార్నర్‌కి తెలుగుపై ఇంత పట్టుందా? 

(photo:David Warner Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏడాదికి పైగా కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని క్రీడా కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఆటగాళ్లలందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, కొంతమంది క్రికెటర్లు ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని చాలా బాగా ఎంజాయ్‌ చేశారు. అందులో ముఖ్యంగా చెప్పుకొవాల్సింది.. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ గురించి. తన పిల్లలు, సతీమణి కాండీస్‌తో కలిసి టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ వార్నర్‌ హల్‌చల్‌ చేశాడు.

ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లోని పాటలకు స్టెప్పులేసి, తన నోటి వెంట డైలాగ్‌లు చెప్పి అభిమానులను ఎంటర్‌టైన్‌ చేశాడు. ముఖ్యంగా ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలోని ‘బుట్ట బొమ్మా’, ‘రాములో రాములా, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్‌ బ్లాక్‌’ అనే పాటలకు చిందులేసి తెలుగు వారి మనసులను దోచుకున్నాడు వార్నర్‌. అలాగే మహేష్ బాబు నటించిన ‘పోకిరి, ప్రభాస్‌ నటించిన ‘బహుబలి’ చిత్రాలకు సంబంధించిన డైలాగ్‌లకు టిక్‌టాక్‌లు చేశాడు. ఇలా క్రీడాభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా డేవిడ్‌ ఫ్యాన్స్‌గా మారిపోయారు. 

ఇదిలా ఉండగా,  గురువారం వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ఆసక్తికరమైన ఫొటోను పోస్టు చేశాడు. ఈ ఫొటోకు వార్నర్‌ జతచేసిన వ్యాఖ్యను చదివిన  తెలుగు అభిమానుల ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే..  చేతిలో గులాబీ పువ్వులను పట్టుకుని తన భార్య కాండీస్‌ను ఎత్తుకున్నట్టు ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ..  ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్‌లో రాశాడు. దీనికి వార్నర్‌ భార్య కాండీస్‌ వెంటనే ప్రేమకు చిహ్నామైన  లవ్‌ ఎమోజీలను రిప్లేగా ఇచ్చింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోస్టు చేసిన రెండు గంటల్లో సూమారు 6 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.



CPYAGVsLQcb

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net