ప్రధానాంశాలు

Published : 08/05/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IPL: ఏం తప్పు జరిగిందో తెలియదు: చాహర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో పలువురు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి కరోనా ఎక్కడి నుంచి సోకిందో తెలియదని, తాము మాత్రం కచ్చితమైన బయోబబుల్‌ నిబంధనలు పాటించామని చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేసర్‌ దీపక్‌ చాహర్‌ అన్నాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ.. కొందరికి కరోనా పాజిటివ్‌గా తెలిసిన వెంటనే జట్టు యాజమాన్యం తమను ఐసోలేషన్‌లోకి వెళ్లమని చెప్పిందని చాహర్‌ చెప్పాడు.

‘మా బృందంలో కొందరికి పాజిటివ్‌ రాగానే జట్టు యాజమాన్యం మమ్మల్ని ఐసోలేషన్‌లోకి వెళ్లమని చెప్పింది. ప్రతిరోజూ మాకు టెస్టులు జరిగేవి. దాంతో మిగిలిన అందరికీ  నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. అదో పెద్ద ఉపశమనం. పలు కేసులు నమోదైనా మా జట్టులో ఎవరూ భయపడలేదు. అందరూ బాగా సమన్వయం చేసుకున్నారు. అయితే, మా జట్టులో ఎవరూ నిబంధనలు అతిక్రమించలేదు. ప్రతి ఒక్కరూ కచ్చితమైన నియమాలు పాటించారు. ఒక నగరం నుంచి ఇంకో నగరానికి బయో బబుల్‌ మార్చడం అనేది కష్టతరమైన పని. అయితే, అదసలు ఎలా అంటుకుందనే విషయం నాకు తెలియదు’ అని చాహర్‌ వివరించాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ, మైఖేల్‌ హస్సీతో పాటు మరో ఇద్దరు దిగువ స్థాయి సిబ్బంది సైతం వైరస్‌ బారిన పడ్డారు. ఈ క్రమంలోనే మెరుగైన వైద్యం కోసం బాలాజీ, హస్సీని ఎయిర్‌ అంబులెన్స్‌లో చెన్నైకు తరలించారు. మరోవైపు గతేడాది యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ 13వ సీజన్‌కు ముందు సైతం దీపక్‌ చాహర్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తర్వాత అతడు కోలుకొని పలు మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఈ సీజన్‌లో అతడాడిన ఏడు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net