ప్రధానాంశాలు

Published : 17/06/2021 10:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Corona: కొవిడ్‌ చికిత్సకు ఆయుష్‌-64

నూతన ఔషధాన్ని విడుదల చేసిన శ్రీశ్రీ తత్వ 

బెంగుళూరు: కరోనా బాధితుల చికిత్స కోసం శ్రీశ్రీ తత్వ సంస్థ బుధవారం సరికొత్త ఔషధాన్ని విడుదల చేసింది. ‘ఆయుష్‌-64’గా పిలిచే ఈ ఔషధం.. కొవిడ్‌ ప్రారంభ, మధ్యమ దశల్లో ఉన్న రోగులపై ప్రభావవంతంగా పనిచేస్తుందని సంస్థ తెలిపింది. దానికి ఆయుష్‌ మంత్రిత్వ శాఖ గుర్తింపు కూడా లభించినట్లు వెల్లడించింది. ఆయుష్‌-64 తయారీకి కావాల్సిన సాంకేతికతను జాతీయ పరిశోధన, అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌డీసీ) నుంచి పొందినట్లు పేర్కొంది. మాత్రల రూపంలో దేశ విదేశాల్లో ఈ ఔషధాన్ని పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. 

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net