ప్రధానాంశాలు

Published : 18/06/2021 08:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Corona: చిన్నారికి ‘ఎక్మో’ చికిత్సతో పునర్జన్మ

దేశంలో తొలిసారని కిమ్స్‌ వైద్యుల ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: కరోనాతో ఆరోగ్యం విషమంగా మారిన 9 నెలల చిన్నారికి సంక్లిష్టమైన ఎక్మో (ఎక్స్‌ట్రా కార్పొరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌) చికిత్స అందించి కిమ్స్‌ వైద్యులు ప్రాణాలు కాపాడారు. కిమ్స్‌ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్యులు డాక్టర్‌ వి.నందకిశోర్‌, డాక్టర్‌ డి.పరాగ్‌ శంకర్‌రావు వివరాలను గురువారం మీడియాకు వెల్లడించారు. ఆదిలాబాద్‌కు చెందిన చిన్నారి శ్రీయాష్‌ (9 నెలలు)కు కరోనా సోకడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. తల్లిదండ్రులు బాలుడిని హైదరాబాద్‌ కొండాపూర్‌లోని కిమ్స్‌లో చేర్పించారు. చిన్నారిని ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స ప్రారంభించినా మార్పు రాకపోవడంతో హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్‌పైకి మార్చారు. ఇక్కడ ఊపిరితిత్తుల నుంచి గాలి లీక్‌ అవుతూ బాలుడి ఆరోగ్యం మరింత సంక్లిష్టమైంది. దాంతో వైద్యులు ఎక్మో సహాయంతో 12 రోజులపాటు చికిత్స అందించారు. కొవిడ్‌ బారిన పడిన పిల్లల చికిత్సలో ఎక్మో వాడటం దేశంలోనే తొలిసారని డాక్టర్‌ నందకిశోర్‌ తెలిపారు.

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net