ప్రధానాంశాలు

Published : 06/05/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్లీజ్‌ ‘Sir’ అని పిలవకండి: జడ్డూ

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనను ‘సర్’ అంటూ సంబోధించొద్దని కేవలం పేరుపెట్టి పిలిస్తే చాలని చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అన్నాడు. క్రికెట్‌ కామెంటేటర్‌ హర్షభోగ్లే వ్యాఖ్యలపై స్పందించాడు.

కరోనా వైరస్‌ కారణంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా సీజన్‌ నిరవధికంగా వాయిదా పడింది. దాదాపుగా సగం సీజన్‌ ముగియడంతో ఇప్పటి వరకు అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ ఎవరో కామెంటేటర్‌ హర్షభోగ్లే విశ్లేషణ చేశారు. రవీంద్ర జడేజాయే అత్యుత్తమమని తేల్చారు.

‘ఈ సీజన్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన ఒక్కటే, అదీ సర్‌ జడేజాదే. బెంగళూరు మ్యాచు ఆఖరి ఓవర్లో అతడు 37 పరుగులు చేశాడు. 13 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మరొకరిని రనౌట్‌ చేశాడు. ఒక్కడే ఇలా చేయడం అద్భుతం. ఇంతకన్నా మెరుగైన ప్రదర్శన ఉంటే చెప్పండి. చూసేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని భోగ్లే అన్నారు.

భోగ్లే విశ్లేషణకు జడ్డూ ధన్యవాదాలు తెలిపాడు. ‘హర్షభోగ్లేకు కృతజ్ఞతలు. మీరు రవీంద్ర జడేజా అంటేనే నాకు మరింత సంతోషం’ అని ట్వీట్‌ చేశాడు. ఈ సీజన్లో 7 మ్యాచులాడిన జడ్డూ 6 వికెట్లు తీసి 131 పరుగులు చేశాడు. 62* అత్యధిక స్కోరు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net