ప్రధానాంశాలు

Published : 15/05/2021 16:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IND-AUS మధ్య విమాన సేవలు పునఃప్రారంభం

కాన్‌బెర్రా: భారత్‌- ఆస్ట్రేలియా మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి.  కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చిన విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం గడువు మే 14 అర్ధరాత్రితో ముగియడంతో ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీంతో 80మంది ప్రయాణికులతో భారత్‌ నుంచి బయల్దేరిన విమానం ఆస్ట్రేలియాకు చేరుకుంది. 

విమానాల నిషేధం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ మాట్లాడుతూ.. క్వారంటైన్‌ కేంద్రాలను దాటి ప్రజల్లోకి కరోనా వ్యాపించకుండా అడ్డుకునేందుకు ఈ నిషేధం సహకరించిందని తెలిపారు. తద్వారా మూడో వేవ్‌ రాకుండా నిలువరించగలిగామని అభిప్రాయపడ్డారు. మే 3న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ప్రయాణాలపై నిషేధం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారి అక్కడి ప్రభుత్వం తమ దేశ పౌరులపై కఠిన నిబంధనలు విధించింది. భారతదేశంలో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలోకి అడుగు పెడితే కఠిన శిక్షలతో పాటు భారీ జరిమానా విధిస్తామంటూ హెచ్చరించడం ఇటీవల సంచలనమైంది.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net