ప్రధానాంశాలు

Published : 05/05/2021 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
 IPL: భద్రత విషయంలో రాజీలేదు: జేషా

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో మంగళవారం టోర్నీని అనూహ్యంగా నిరవధిక వాయిదా వేశారు. అయితే, ఈ టోర్నీతో ముడిపడి ఉన్న ప్రతిఒక్కరి క్షేమం కొరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జేషా పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

‘ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల్ని గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి ఏకగ్రీవంగా మిగతా సీజన్‌ను వాయిదా వేసేందుకు నిర్ణయిం తీసుకున్నాయి. ఆటగాళ్లు, మైదాన సిబ్బంది, టోర్నీతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరి క్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. భద్రత విషయంలో రాజీపడొద్దని భావించాం’ అని షా చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా, తొలుత కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌లకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో సోమవారం బెంగళూరుతో తలపడాల్సిన మ్యాచ్‌ వాయిదా పడింది. తాజాగా సన్‌రైజర్స్‌ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా, దిల్లీ ఆటగాడు అమిత్‌ మిశ్రా సైతం పాజిటివ్‌గా తేలారు. దాంతో టోర్నీ నిర్వహణపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి టోర్నీని నిరవధిక వాయిదా వేశాయి.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net