ప్రధానాంశాలు

Published : 08/05/2021 15:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IPL 2021: కేకేఆర్‌ మరో ఆటగాడికి కరోనా

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌ను, ఆ ఆటగాళ్లను కరోనా వైరస్‌ వదలడం లేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కే చెందిన మరో ఆటగాడు టిమ్‌ సీఫెర్ట్‌కు వైరస్‌ సోకింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతడికి పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా అతడు భారత్‌లోనే ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. కోల్‌కతా జట్టులోనే సందీప్‌ వారియర్‌, వరుణ్‌ చక్రవర్తికి కొవిడ్‌ సోకిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడటంతో విదేశీ  క్రికెటర్లంతా తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే కొన్ని దేశాల్లో ఆంక్షలు ఉండటంలో భారత్‌, మాల్దీవుల్లో వారం రోజులు ఉండి బయల్దేరాలని భావించారు. తిరిగెళ్లే ముందు రెండుసార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. దాంట్లో అతడికి పాజిటివ్‌ రావడం గమనార్హం.

‘బయల్దేరే ముందు చేసిన రెండు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో టిమ్‌ సీఫెర్ట్‌కు పాజిటివ్‌ ఫలితం వచ్చింది. దాంతో క్వారంటైన్‌కు వెళ్లాడు. అతడిలో మోస్తరు లక్షణాలు కనిపించాయి. కివీస్‌ ఆటగాళ్లను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన రెండు ఛార్టర్‌ విమానాలు ఇప్పటికే బయల్దేరాయి. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన మరో విమానం శనివారం సాయంత్రం బయల్దేరుతుంది’ అని న్యూజిలాండ్‌ క్రికెట్‌ తెలిపింది.

గత పది రోజుల్లో చేసిన టెస్టుల్లో సీఫెర్టుకు ఏడుసార్లు నెగెటివ్‌ వచ్చిందని కివీస్‌ క్రికెట్‌సంఘం సీఈ డేవిడ్‌ వైట్‌ అన్నాడు. సంబంధిత ఫ్రాంచైజీ అతడిని సురక్షితంగా చూసుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మైకేల్‌ హస్సీకి చికిత్స అందించిన చెన్నైలోని ఆస్పత్రికి అతడిని పంపించనున్నారని పేర్కొన్నాడు. ఈ విషయం తెలియగానే ఆటగాళ్ల సంఘం నుంచి టిమ్‌కు సహాయం అందించామన్నాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడామని తెలిపాడు. వెంటవెంటనే  కుటుంబీకులకు వివరాలు తెలిసేలా ఏర్పాట్లు చేశామన్నారు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net