ప్రధానాంశాలు

Published : 25/05/2021 17:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Covid: బోరున ఏడ్చేసిన క్రికెటర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ సోకిందని తెలియగానే ఏం చేయాలో అర్థంకాలేదని న్యూజిలాండ్‌ క్రికెటర్‌ టిమ్‌ సీఫెర్ట్‌ అన్నాడు. ప్రాణవాయువు సహకారం తీసుకోవాలా? ఆస్పత్రిలో  పడక దొరుకుతుందా? బయట అవుతున్నట్టే తనకూ జరుగుతుందా? అని కంగారు పడ్డానన్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహకారంతో కుదుట పడ్డానని వివరించాడు. కొవిడ్‌-19 గురించి వివరిస్తూ అతడు బోరున విలపించాడు.

వైరస్‌ కేసులు పెరగడంతో ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. టిమ్‌ సీఫెర్ట్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు సభ్యుడు. లీగ్‌ వాయిదా పడ్డాక తన దేశస్థులతో కలిసి స్వదేశం వెళ్లేందుకు అతడు సిద్ధమయ్యాడు. మరుసటి రోజు విమానం ఎక్కుతామనగా అతడికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో చెన్నైలో క్వారంటైన్‌ అయ్యాడు. కోలుకున్నాక న్యూజిలాండ్‌ వెళ్లాడు. తన అనుభవాన్ని వివరిస్తూ కన్నీరు కార్చాడు.

‘కరోనా పరీక్ష ఫలితం పాజిటివ్‌ అని చెన్నై సూపర్‌కింగ్స్‌ మేనేజర్‌ చూపించాడు. దాంతో ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. బాగా భయమేసింది. భారత్‌లో బాధితుల గురించి మీరు వినే ఉంటారు. నాకూ అలాగే జరుగుతుందా? అని ఆందోళన చెందాను. ఆక్సీజన్‌ కొరత వార్తలే వినిపించేవి. అలాంటి పరిస్థితులు ఎదురవుతాయో లేదో తెలియదు. అసలు కొవిడ్‌ గురించే ఇంకా పూర్తిగా తెలియదు’ అని సీఫెర్ట్‌ అన్నాడు.

సీఎస్‌కే కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, కేకేఆర్‌ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ తనకు కాస్త ఉపశమనం కలిగించారని టిమ్‌ తెలిపాడు. ‘వారు నాకు భరోసా కల్పించారు. అన్నీ సవ్యంగా ఉండేట్టు చూసుకున్నారు. సీఎస్‌కే, కేకేఆర్‌ యాజమాన్యాలూ పరిస్థితిని పర్యవేక్షించాయి. ఇంటికి క్షేమంగా తిరిగివెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఏదేమైనా పాజిటివ్‌గా ఉండాలని అర్థమైంది. అనుకున్న సమయం కన్నా ముందుగానే రావడంతో నాకు కాబోయే భార్య సంతోషించింది’ అని సీఫెర్ట్‌ వెల్లడించాడు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net