ప్రధానాంశాలు

Published : 29/04/2021 21:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోల్‌కతాను ఆదుకున్న రసెల్‌, శుభ్‌మన్‌

దిల్లీ లక్ష్యం 155

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌(43; 38 బంతుల్లో 3x4, 1x6), మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఆండ్రీ రసెల్‌(45; 27 బంతుల్లో 2x4, 4x6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. అంతకుముందు ఓపెనర్‌ నితీశ్‌ రాణా(15; 12 బంతుల్లో 1x4, 1x6) ఆదిలోనే విఫలమయ్యాడు. అయితే.. శుభ్‌మన్‌, రాహుల్‌ త్రిపాఠి(19; 17 బంతుల్లో 2x4) రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ధాటిగా ఆడుతున్న వీరిని స్టోయినిస్‌ దెబ్బతీశాడు. పదో ఓవర్‌లో రాహుల్‌ను ఔట్‌ చేసి దిల్లీకి రెండో బ్రేకిచ్చాడు. ఆపై లలిత్‌ యాదవ్‌ 11వ ఓవర్‌లో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, సునీల్‌ నరైన్‌ను డకౌట్లుగా పెవిలియన్‌ పంపాడు. తర్వాత శుభ్‌మన్‌.. కాసేపటికే దినేశ్‌ కార్తీక్‌(14) సైతం ఔటయ్యారు. అప్పటికి కోల్‌కతా స్కోర్‌ 16.2 ఓవర్లలో 109/6గా నమోదైంది. చివర్లో రసెల్‌, పాట్‌ కమిన్స్‌(11 నాటౌట్‌; 13 బంతుల్లో 1x4) ధాటిగా ఆడి జట్టు స్కోరును 150 దాటించారు. దిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌, లలిత్‌ యాదవ్‌ చెరో రెండు వికెట్లు తీయగా స్టోయినిస్‌ ఒక వికెట్ పడగొట్టాడు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net