ప్రధానాంశాలు

Published : 17/05/2021 21:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Ball Tampering: అందులో ఆశ్చర్యమేముంది?

మెల్‌బోర్న్‌: బాల్‌టాంపరింగ్‌ వివాదం గురించి ఆస్ట్రేలియా బౌలర్లకు ముందే తెలిసినంత మాత్రాన అందులో ఆశ్చర్యపోడానికి ఏముందని ఆ జట్టు మాజీ సారథి మైఖేల్‌ క్లార్క్‌ అన్నాడు. ఆ వివాదానికి ప్రధాన సూత్రధారి అయిన కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ ఇటీవల ఓ అంతర్జాతీయ పత్రికతో మాట్లాడుతూ.. నాటి ఉదంతం గురించి తమ బౌలర్లకు కూడా ముందే తెలుసని చెప్పాడు. దాంతో 2018 నాటి బాల్‌ టాంపరింగ్‌ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌ ఆస్ట్రేలియా దానిపై మరోసారి విచారణకు ఆదేశించింది. అలాగే ఆ మ్యాచ్‌లో ఆడిన ఇతర ఆటగాళ్లకు కూడా నాటి ఉదంతంపై ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని కోరింది.

2018లో కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా ఆడిన మూడో టెస్టులో బాన్‌క్రాఫ్ట్‌ తన జేబులో ఉన్న ఉప్పుకాగితంతో బంతిని రుద్దాడు. ఆ సంఘటన కెమెరాల్లో స్పష్టంగా కనిపించడంతో తీవ్ర దుమారం రేగింది. అనంతరం క్రికెట్‌ ఆస్ట్రేలియా అతడిపై 9 నెలలు నిషేధం విధించగా, కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌లను ఏడాది పాటు నిషేధించింది. ఆ ఉదంతంతో ప్రపంచ క్రికెట్‌లో కంగారూ జట్టు తీవ్ర అవమానం ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే బాన్‌క్రాఫ్ట్‌ ఇటీవల ఓ పేరుమోసిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ బౌలర్లకు కూడా ఆ విషయం ముందే తెలుసన్నాడు. దీనిపై స్పందించిన క్లార్క్‌ అందులో తానేమీ ఆశ్చర్యపోవట్లేదని చెప్పాడు. ‘బాల్‌ టాంపరింగ్‌ గురించి ముగ్గురి కన్నా ఎక్కువ మందికి తెలిస్తే ఆశ్యర్యపోడానికి ఏముంది? ఒకవేళ తెలిసినా ఎవరూ ఆశ్చర్యపోరని నేను అనుకుంటున్నా’నని క్లార్క్‌ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ వివాదంపై నాటి ఆసీస్‌ బౌలింగ్‌ కోచ్‌ డేవిడ్‌ సేకర్‌ మాట్లాడుతూ అది భారీ తప్పిదమని, అలా జరగకుండా ఉండాల్సిందని పేర్కొన్నాడు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net