ప్రధానాంశాలు

Published : 06/05/2021 12:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
MS Dhoni: వెళ్లే ఆఖరి వ్యక్తిని నేనౌతా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: శిబిరం నుంచి ఇంటికి వెళ్లే ఆఖరి వ్యక్తిని తానే అవుతానని చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోనీ అన్నాడు. ముందుగా విదేశీయులు ఇళ్లకు వెళ్తారని ఆ తర్వాత భారత ఆటగాళ్లు వెళ్లాలని సూచించాడు. అందరూ వెళ్లాకే తాను రాంచీకి బయల్దేరుతానని స్పష్టం చేయడం గమనార్హం

ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్‌ శిబిరమంతా దిల్లీలో ఉంది. ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు బయల్దేరారు. అంతకు ముందు వర్చువల్‌గా నిర్వహించిన జట్టు సమావేశంలో మహీ మాట్లాడాడు. ఐపీఎల్‌ భారత్‌లో జరుగుతోంది కాబట్టి తొలుత విదేశీయులు, సహాయ సిబ్బంది వెళ్లాలని చెప్పాడు. ఆ తర్వాతి ప్రాధాన్యం భారతీయులకని పేర్కొన్నాడు. హోటల్‌ను విడిచే ఆఖరి వ్యక్తిని తానేనని స్పష్టం చేశాడు.

ఆటగాళ్లను సొంత నగరాలకు చేర్చేందుకు సీఎస్‌కే ఛార్టర్‌ విమానాలను ఏర్పాటు చేసింది. పది మంది ప్రయాణించగల ఈ విమానం గురువారం ఉదయం రాజ్‌కోట్‌, ముంబయి ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లను తీసుకెళ్లింది. సాయంత్రం విమానంలో బెంగళూరు, చెన్నై క్రికెటర్లు వెళ్తారు. చివరికి ధోనీ.. రాంచీకి చేరుకుంటాడు. ఇక ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ సైతం భారత క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానాలే ఏర్పాటు చేశాయి. రాజస్థాన్‌, కోల్‌కతా, హైదరాబాద్‌ మాత్రం వాణిజ్య విమానాల్లో పంపిస్తున్నాయి.

అహ్మదాబాద్‌లో ఉన్న కొందరు ఆటగాళ్లు ముంబయి, పంజాబ్‌, దిల్లీకి వెళ్లేందుకు ప్రత్యేకంగా క్యాబులు బుక్‌ చేసుకున్నారని తెలిసింది. ఆటగాళ్లంతా ఇంటికి వెళ్లాక మూడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలని బీసీసీఐ సూచించింది. మూడో రోజు తర్వాత ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయిస్తామని తెలిపింది.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net