ప్రధానాంశాలు

Published : 06/05/2021 23:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IPL: న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌కు పయనం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్ 14వ సీజన్‌ వాయిదా పడటంతో ఆస్ట్రేలియా మినహా ఇతర విదేశీ ఆటగాళ్లంతా తమ స్వస్థలాలకు బయలుదేరారు. అయితే, న్యూజిలాండ్‌ జట్టులోని నలుగురు టెస్టు క్రికెటర్లు మాత్రం మే 11న భారత్‌ నుంచి ఇంగ్లాండ్‌కు పయనమవుతారని ఆ దేశ క్రికెట్‌ బోర్డు గురువారం వెల్లడించింది. అప్పటి దాకా కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, కైల్‌ జేమీసన్‌, స్పిన్నర్‌ మిచెల్‌ శాంట్నర్‌తో పాటు ఆ జట్టు ఫిజియో టామీ సిమ్‌సెక్‌ మిని క్వారంటైన్‌లో ఉంటారని చెప్పింది.

కాగా, జూన్‌ 2 నుంచి న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌ జరగనుంది. ఆపై 18 నుంచి టీమ్‌ఇండియాతో కివీస్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తలపడనుంది. ఈ నేపథ్యంలోనే పైన పేర్కొన్న నలుగురు కివీస్‌ జట్టు సభ్యులు ఇక్కడి నుంచి ఇంగ్లాండ్‌కు బయలుదేరుతారని ఆ జట్టు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌వైట్‌ పేర్కొన్నారు. ఆటగాళ్లను క్షేమంగా  తరలించే విషయంలో బీసీసీఐ, ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలతో మాట్లాడామని, ఇలాంటి విపత్కర సమయంలో వాళ్ల పనితీరుకు అభినందిస్తున్నామని డేవిడ్‌ చెప్పుకొచ్చారు.

ఈ ఐపీఎల్‌లో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు 10 మంది ఉండగా మిగతా కోచ్‌లు, సహాయక సిబ్బంది ఏడుగురు ఉన్నారు. విలియమ్సన్‌, జేమీసన్‌, మిచెల్‌, టామీ తప్ప మిగతా అందరూ శుక్రవారం ప్రత్యేక ఛార్టర్‌ విమానంలో స్వదేశానికి బయలుదేరతారని చెప్పారు. మరోవైపు ఆ జట్టులోని కీలక పేసర్‌ ట్రెంట్‌బౌల్ట్‌ తొలుత ఇంటికి చేరి కొద్దిరోజులు కుటుంబంతో గడిపి తర్వాత ఇంగ్లాండ్‌కు పయనమవుతాడని డేవిడ్‌ వివరించారు. ఈ సందర్భంగా తమ జటులోని నలుగురికి కాస్త ముందుగానే ఆతిథ్యమిస్తున్న ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డుకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net