ప్రధానాంశాలు

Published : 18/06/2021 14:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Modi: వైరస్ ముప్పు తొలగిపోలేదు..సిద్ధంగా ఉందాం

ఫ్రంట్‌లైన్ సిబ్బందికి క్రాష్ కోర్సు ప్రారంభం

దిల్లీ: కరోనా మహ్మమారి వేగంగా మార్పులు చేసుకొని కొత్త సవాళ్లను విసురుతోందని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. వైరస్‌ కట్టడికి వేగంగా సిద్ధమవ్వాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. దానిలో భాగంగా కొవిడ్‌-19 ఫ్రంట్‌లైన్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే నిమిత్తం కస్టమైజ్‌డ్‌ క్రాష్ కోర్సును ప్రారంభించారు.

‘కొవిడ్‌-19 ముప్పు ఇంకా పొంచి ఉంది. వైరస్ ఉత్పరివర్తనం చెందడానికి చాలా అవకాశం ఉంది. వైరస్ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి వేగంగా సిద్ధం కావాలి. అందుకు దేశంలో లక్షమంది ఫ్రంట్‌లైన్ సిబ్బందిని సిద్ధం చేసే దిశగా కృషి చేస్తున్నాం’ అని మోదీ వెల్లడించారు. రెండుమూడు నెలల్లో ఈ క్రాష్ కోర్సు పూర్తవుతుందని తెలిపారు. వారి సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విధుల్లో ఉన్న సిబ్బంది పని భారాన్ని తగ్గించేందుకు వీరు ‘శిక్షణ పొందిన సహాయక్‌’గా వ్యవహరిస్తారు. ఆ కస్టమైజ్‌డ్ క్రాస్‌ కోర్సును ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 కింద రూపొందించారు. వారికి శిక్షణ ఇచ్చేందుకు రూ.276 కోట్లను ఖర్చుచేయనున్నారు. 26 రాష్ట్రాల్లో 111 శిక్షణా కేంద్రాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన చేసింది.

హోమ్ కేర్ సపోర్ట్, బేసిక్ కేర్ సపోర్ట్, అడ్వాన్స్‌డ్ కేర్ సపోర్ట్, ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్, శాంపిల్ కలెక్షన్ సపోర్ట్, మెడికల్ ఎక్విప్‌మెంట్ సపోర్ట్.. ఇలా ఆరు విషయాల్లో వారు శిక్షణ పొందనున్నారు.


ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net