ప్రధానాంశాలు

Published : 07/05/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IPL వాయిదాకు రోహిత్‌ మద్దతు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజలు, అభిమానులు కొవిడ్‌ నియమావళిని పాటిస్తూ సురక్షితంగా ఉండాలని ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ పిలుపునిచ్చాడు. ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ నిరవధిక వాయిదాకు అతడు మద్దతు ప్రకటించాడు. ఆట కన్నా ఆరోగ్యమే ముఖ్యమని పేర్కొన్నాడు. ఎంఐ టీవీతో అతడు మాట్లాడాడు.

‘ప్రస్తుతం దేశ పరిస్థితి దృష్ట్యా ఐపీఎల్‌ను వాయిదా వేయాలన్న నిర్ణయం సరైందే’ అని రోహిత్‌ శర్మ అన్నాడు. ‘పల్టాన్‌, టోర్నీ సాంతం మాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు! మళ్లీ మనం కలిసే వరకు మీరంతా సురక్షితంగా, బలంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని హిట్‌మ్యాన్‌ తెలిపాడు. అతడితో పాటు జస్ప్రీత్‌ బుమ్రా, ఆడమ్‌ మిల్న్‌, జయంత్‌ యాదవ్‌, షేన్‌ బాండ్‌, రాబిన్‌ సింగ్‌ సైతం వీడియోలో ఉన్నారు.

బయో బుడగలో ఉన్నప్పటికీ ఆటగాళ్లకు కొవిడ్‌ సోకడంతో ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వృద్ధిమాన్‌ సాహా, అమిత్‌ మిశ్రా, సందీప్‌ వారియర్‌, వరుణ్ చక్రవర్తి, లక్ష్మీపతి బాలాజీ, మైక్‌ హస్సీ పాజిటివ్‌గా తేలారు. దాంతో మ్యాచులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. కాగా 29 మ్యాచులు ముగిసిన లీగులో 7 మ్యాచులాడిన ముంబయి 4 గెలిచి 8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.


COhKy1qK1E5

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net