ప్రధానాంశాలు

Published : 05/05/2021 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IPL Postpone: బాధగా ఉన్నా ఫర్వాలేదు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ సరిగ్గా సగం మ్యాచ్‌లు పూర్తయ్యాక పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దాంతో మిగతా సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. అదెప్పుడు తిరిగి నిర్వహిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. పరిస్థితులు చక్కబడ్డాక సరైన సమయం చూసి నిర్వహిస్తామని బీసీసీఐ, ఐపీఎల్  పేర్కొన్నాయి. కాగా, బయోబబుల్‌ పరిస్థితుల్లో తొలి దశ మ్యాచ్‌లు ముంబయి, చెన్నై వేదికల్లో దిగ్విజయంగా పూర్తి చేయగా ఇటీవలే అన్ని జట్లు దిల్లీ, అహ్మదాబాద్‌ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడికొచ్చాక పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షాభోగ్లే, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌తో పాటు పలువురు నెటిజెన్లు విచారం వ్యక్తం చేశారు. ఈ మెగా ఈవెంట్‌ వాయిదా పడటం బాధాకరమే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో సరైన నిర్ణయమేనని అభిప్రాయపడ్డారు.

* ఐపీఎల్‌ చాలా గొప్ప ఈవెంట్‌. ఈ సీజన్‌ వాయిదా పడటం అనేది గత రెండు మూడు రోజుల పరిస్థితుల ఆధారంగా తప్పనిసరిగా మారింది. ఈ క్రికెట్‌ సమరం మళ్లీ సంతోషకరమైన పరిస్థితుల్లో జరగాలని ఆశిస్తున్నా.   -హర్షాభోగ్లే

* భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, పలువురు ఆటగాళ్లు కూడా వైరస్ బారిన పడుతున్న సందర్భంగా బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి.. ఉన్నపళంగా ఈ టోర్నీని వాయిదా వేయడం సరైన నిర్ణయం. త్వరలోనే ఆరోగ్యకరమైన వాతావరణంలో మళ్లీ ఐపీఎల్‌ జరగాలని కోరుకుంటున్నా.  -అజహరుద్దీన్‌

* ఈసారి ఐపీఎల్ జరగకపోవడం, మన ఇష్టమైన ఆటగాళ్లను చూడకపోవడం బాధగా ఉన్నా ఫర్వాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌ చూడటం కన్నా మనం కొవిడ్‌ వారియర్స్‌కు అండగా నిలవాలి. పరిస్థితులు మెరుగయ్యాక మళ్లీ ఐపీఎల్‌ చూడాలని ఆశిద్దాం.   -ఓ నెటిజెన్‌

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net