ప్రధానాంశాలు

Published : 01/06/2021 15:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
T20 Worldcup: అలా అయితే ఇక్కడే పొట్టి కప్పు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ నిర్వహించేందుకు ఇండియానే తమ తొలి ప్రాధాన్యమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా అన్నారు. దేశంలో పరిస్థితులు మెరుగుపడతాయన్న ధీమా వ్యక్తం చేశారు. ఆతిథ్యం కోసం ఐసీసీని మరికాస్త గడువు అడిగామని ఆయన వెల్లడించారు.

ఈ ఏడాది అక్టోబర్‌లో బీసీసీఐ టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించాల్సి ఉంది. ఐపీఎల్‌ను విజయవంతం చేస్తే భారత్‌లోనే మెగాటోర్నీ నిర్వహించొచ్చని బోర్డు భావించింది. దురదృష్టవశాత్తు కరోనా కేసులు బయట పడటంతో ప్రపంచకప్‌పై సందిగ్ధం నెలకొంది. భారత్‌లో ఆడే పరిస్థితులు లేకుంటే యూఏఈ ప్రత్యామ్నాయ వేదికగా ఉంటుందని ఐసీసీ గతంలో తెలిపింది. సెప్టెంబర్‌లో ఐపీఎల్‌ రెండో దశ సైతం అక్కడే జరుగుతుండటంతో టీ20 ప్రపంచకప్‌నూ అక్కడే నిర్వహిస్తారన్న ప్రచారం కొనసాగుతోంది.

‘టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్యం గురించి చర్చించాల్సి ఉంది. మా తొలి ప్రాధాన్యం మాత్రం భారతదేశమే. అందుకే ఐసీసీని కొంత సమయం కోరాం. నెల రోజుల్లో మేం దాని గురించి నిర్ణయిస్తాం. జూన్‌ చివరి వారం లేదా జులై తొలివారం వరకు దేశంలో కరోనా పరిస్థితి మెరుగుపడకుంటే టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి కచ్చితంగా తరలించాల్సిందే. ఒకవేళ పరిస్థితులు మెరుగుపడి, టోర్నీ జరిగేలా ఉంటే.. మేం కచ్చితంగా భారత్‌లోనే నిర్వహిస్తాం’ అని రాజీవ్‌ శుక్లా మీడియాకు తెలిపారు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net