ప్రధానాంశాలు

Published : 10/05/2021 10:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Covid: టీ20 ప్రపంచకప్‌నకూ తప్పకపోవచ్చు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిరవధికంగా వాయిదా పడటం ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వేదిక తరలింపునకు లేదా వాయిదాకు కారణం కావొచ్చని ఆస్ట్రేలియా  మాజీ సారథి ఇయాన్‌ ఛాపెల్‌ అంటున్నాడు. గతంలోనూ అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నాడు. అందులో కొన్ని ఆసక్తికర మ్యాచులకు దారితీయగా కొన్నిబాధాకరమని వెల్లడించాడు.

భారత్‌లో నిర్వహించిన ఐపీఎల్‌ 2021 సీజన్‌ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. బయో బుడగలోని ఆటగాళ్లకు వైరస్ సోకడమే ఇందుకు కారణం. కోల్‌కతా ఆటగాళ్లు సందీప్‌ వారియర్‌, వరుణ్‌ చక్రవర్తి, సన్‌రైజర్స్‌ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా, దిల్లీ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రాకు సీజన్‌ మధ్యలో పాజిటివ్‌ వచ్చింది. బుడగ బలహీన పడటం, ఆటగాళ్లు ఆందోళనకు లోనవ్వడంతో లీగ్‌ను వాయిదా వేయక తప్పలేదు.

‘కరోనా వైరస్‌ కారణంగా ప్రజలు మరణించడం, ఆటగాళ్లకు వైరస్‌ సోకడంతో ఐపీఎల్‌ 2021 సీజన్‌ వాయిదా పడింది. అంటే తర్వాత జరిగే ఆటకూ ఈ ప్రమాదం తప్పదని తెలుస్తోంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్‌ నిరవధిక వాయిదా మాదిరిగానే మిగతా టోర్నీలకూ ముప్పు తప్పకపోవచ్చు. భారత్‌లో అక్టోబర్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ వేదికను మార్చాల్సి రావొచ్చు. లేదా వాయిదా వేయాల్సి రావొచ్చు’ అని ఛాపెల్‌ అన్నాడు.

వివిధ కారణాలతో గతంలోనూ క్రికెట్‌ టోర్నీలు వాయిదా పడ్డాయని ఇయాన్‌ ఛాపెల్‌ గుర్తు చేశాడు. ఇందులో కొన్నింటికి ఆసక్తికర నేపథ్యాలు ఉన్నాయని పేర్కొన్నాడు. 1970-71లో భారీ వర్షం కారణంగా ఎంసీజీలో బాక్సింగ్‌ డే టెస్టు ఒక్క బంతీ పడకుండానే రద్దు కావడంతో తొలి వన్డేకు దారితీసిందని వెల్లడించాడు. ఆటగాళ్లను సంప్రదించకుండానే 50 ఓవర్ల మ్యాచుకు రెండు దేశాలు నిర్ణయం తీసుకున్నాయని తెలిపాడు. దాంతో ఇంగ్లిష్ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారని వివరించాడు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net