ప్రధానాంశాలు

Published : 14/09/2020 13:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
RCB: కొత్త కొత్తగా ఉన్నదీ..

నూతనత్వం కనిపిస్తోందన్న ఏబీ

(Twitter/RCB)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది తమ జట్టు సరికొత్తగా అనిపిస్తోందని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కీలక ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ అన్నాడు. చాలా తాజాగా అనిపిస్తోందని పేర్కొన్నాడు. సారథి విరాట్‌ కోహ్లీ తమ బృందాన్ని విలువలతో ముందుకు నడిపిస్తున్నాడని ప్రశంసించాడు. జట్టు కోసం అతనెంతో కష్టపడతాడని పేర్కొన్నాడు. ఆర్‌సీబీ యూట్యూబ్‌ ఛానల్‌ ‘బోల్డ్‌ డైరీస్‌’లో అతడు మాట్లాడాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న జట్లలో ఆర్‌సీబీ ఒకటి. కానీ ఇప్పటి వరకు ట్రోఫీని ముద్దాడలేదు. స్టార్లు ఎందరున్నా ఏదో ఒక విభాగంలో ఎప్పుడూ వెనకంజే వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టులో సమూల మార్పులు చేశారు. కోచింగ్‌ సిబ్బందిని మార్చేశారు. క్రికెట్‌ డైరెక్టర్‌గా మైక్‌ హెసన్‌ను ఎంచుకున్నారు. బౌలింగ్‌, ఆల్‌రౌండ్‌ విభాగాలని పటిష్ఠం చేశారు. తాజా సీజన్‌ కోసం ఎంతో కష్టపడుతున్నారు. దుబాయ్‌లో ఆ జట్టెంతో ఉత్సాహంతో  కనిపిస్తోంది.

‘ప్రతిసారీ ఏ సీజన్‌ మాదే అని చెప్పడం ఇబ్బందికరమే. వివరించలేను కానీ, ఈ సంవత్సరం మాత్రం భిన్నంగా ఉంటుందని హామీ ఇవ్వగలను. లీగ్‌లో అత్యుత్తమ జట్టు మాదే అని చెప్పను. అయితే చాలా తాజాగా కనిపిస్తోంది. ఆత్రుతగా ఉంది. జట్టు కూర్పు గురించి ఆలోచిస్తున్నాం. విభిన్నంగా ప్రయత్నించేందుకు వనరులు ఉన్నాయి. అత్యుత్తమ పదకొండు మందిని ఎంచుకొనేందుకు కోచ్‌, విరాట్‌కు చాలా ఐచ్ఛికాలు ఉన్నాయి’ అని ఏబీ అన్నాడు.

‘ప్రతి మ్యాచ్‌లో ఏబీ ఆడతాడని చెప్పలేను. పార్థివ్‌ లేదా డేల్‌ స్టెయిన్‌ ఎవరైనా ఆడొచ్చు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌లో చాలా వనరులు ఉన్నాయి. మా పని విలువలు అద్భుతంగా ఉన్నాయి. అంటే గతంలో బాగాలేవని కాదు. ఈ సారి మాత్రం ప్రతి ఒక్కరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. కసితో కనిపిస్తున్నారు. అందుకు విరాట్‌ను అభినందించాలి. జట్టును ముందుండి నడిపిస్తూ ప్రమాణాలు నిర్దేశిస్తాడు. అలాంటి నాయకుడు ఉంటే ఇవన్నీ అనుసరించడం సులభమే. కటిచ్‌, హెసన్‌ అద్భుతంగా తర్ఫీదు ఇస్తున్నారు. వారి వ్యూహాలు ఫలిస్తాయనే అనుకుంటున్నా’ అని డివిలియర్స్‌ చెప్పాడు.

ఇదీ చదవండి: IPL: కలిసి దంచితే..


Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net