ప్రధానాంశాలు

Published : 03/05/2021 14:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
SRH ఇదేం నిర్ణయం? బ్యాటర్‌గానూ వద్దా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో బ్యాట్స్‌మన్‌గానూ డేవిడ్‌ వార్నర్‌కు చోటు దక్కకపోవడం విస్మయం కలిగించిందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ దీప్‌దాస్‌ గుప్తా అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ సారథుల్లో ఒకడైన కేన్‌ విలియమ్సన్‌కు నాయకత్వం అప్పగించడంలో అర్థముందని పేర్కొన్నారు. అయితే, ఆటగాడిగానూ డేవీని తీసుకోకపోవడం అర్థరహితంగా అనిపించిందన్నారు. ఆ జట్టులో ఇబ్బందులు ఉన్నాయని వెల్లడించారు.

‘టోర్నీకి ముందు సన్‌రైజర్స్‌ నా టాప్-4 జట్లలో ఒకటి. కానీ, వాళ్లు అంచనాలు అందుకోవడం లేదు. నిజమే, భువీ, నటరాజన్‌ గాయపడ్డారు. వార్నర్‌ గొప్ప ఫామ్‌లో లేడు. కానీ, వారి నిర్ణయాలు కొన్ని అర్థరహితంగా ఉంటున్నాయి. తుది జట్టులో డేవీ లేకపోవడం నాకు విస్మయం కలిగించింది. గొప్ప నాయకుడు కాబట్టి సారథ్యాన్ని విలియమ్సన్‌కు బదిలీ చేశారు. కనీసం ఆటగాడిగా వార్నర్‌ లేకపోవడం ఆశ్చర్యమే’ అని దీప్‌దాస్‌ అన్నారు.

‘వార్నర్‌కు చోటివ్వకపోవడం దురదృష్టకరం, అన్యాయం. మరోపక్క అతడి స్థానంలో ఆడిన వారిని ఒక్క మ్యాచుతోనే నిర్ణయించకూడదు. తగినన్ని అవకాశాలు ఇవ్వాలి. ఏదేమైనప్పటికీ హైదరాబాద్‌ జట్టులో స్థిరత్వం కనిపించడం లేదు. వాళ్లు చాలామందిని ఆడించారు. వివిధ కూర్పులను ప్రయత్నించారు. ఏవీ పనిచేస్తున్నట్టు అనిపించడం లేదు. 23 మందిలో 21 మందిని ప్రయత్నించారంటేనే డ్రస్సింగ్‌ రూమ్‌ వాతావరణం గురించి అర్థం చేసుకోవచ్చు’ అని దాస్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net