ప్రధానాంశాలు

Published : 21/08/2020 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోహ్లీ.. నువ్వెక్కడ?

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 సందడి పెరుగుతోంది. జట్లన్నీ యూఏఈ చేరుకుంటున్నాయి. ఇప్పటికే రాజస్థాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అక్కడ అడుగుపెట్టాయి. శుక్రవారం ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజ్స్‌ బెంగళూరు ప్రత్యేక విమానాల్లో అక్కడికి బయల్దేరాయి.

యూఏఈ విమానం ఎక్కిన ఆనందంలో ఆర్‌సీబీ ఆటగాళ్లు ట్విటర్లో ఫొటోలు, వీడియోలు పెట్టారు. అందులో అంతా ఫేస్‌ కవర్లు, మాస్క్‌లు వేసుకొని ఉన్నారు. పార్థివ్‌ పటేల్‌, యుజువేంద్ర చాహల్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైని, వాషింగ్టన్‌ సుందర్‌, పవన్‌ నేగి బాగానే కనిపించారు. మిగతావాళ్లు గుర్తించే విధంగా లేరు.

అంతమందిలో ఆ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. దాంతో అందరిలోనూ సందేహాలు తలెత్తాయి. ‘కింగ్‌ ఎక్కడ’, ‘విరాట్‌ ఎక్కడ’, ‘విరాట్‌ కనిపించడం లేదు’, ‘కోహ్లీ వీరితో పాటు రావడం లేదా’, ‘కోహ్లీ మరో ప్రత్యేక విమానంలో వస్తున్నాడా’ అని అభిమానులు ప్రశ్నించారు. కాగా అతడి ప్రయాణంపై ఫ్రాంచైజీ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. బహుశా తన సతీమణి అనుష్క శర్మతో కలిసి కోహ్లీ వస్తాడేమోనని కొందరు అంచనా వేశారు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటి వరకు ట్రోఫీ గెలవలేదు. స్టార్లు ఉన్నప్పటికీ ఆ జట్టు ఏదో ఒక విభాగంలో విఫలమవుతూనే ఉంది. బ్యాట్స్‌మెన్‌ రాణించినప్పటికీ ఎక్కువసార్లు బౌలింగ్‌లో తేలిపోయేది. ఎంత పెద్ద లక్ష్యం నిర్దేశించినా ప్రత్యర్థి జట్టు ఛేదించేది. ఈ సారి బౌలింగ్‌ విభాగం కాస్త పటిష్ఠంగానే కనిపిస్తోంది.


Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net