ప్రధానాంశాలు

Published : 25/05/2021 11:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Team India: టెస్టు క్రికెట్‌ను బతికించిన కోహ్లీసేన

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ప్రపంచ క్రికెట్‌కు భారత్‌ అవసరం ఉందని న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ రిచర్డ్ హెడ్లీ అన్నారు. ఆస్ట్రేలియాలో అద్భుత విజయంతో టెస్టు క్రికెట్‌కు మళ్లీ ప్రాణం పోసిందని ప్రశంసించారు. బీసీసీఐ అటు ఐపీఎల్‌ వంటి టోర్నీలతో ఆదాయంపై దృష్టి పెట్టడమే కాకుండా సుదీర్ఘ ఫార్మాట్లో రాణిస్తోందని వెల్లడించారు. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ మున్ముందు మరింత ఆసక్తికరంగా మారొచ్చని అంచనా వేశారు.

‘టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ ఒక్క మ్యాచే కాబట్టి రెండు జట్లూ ప్రశాంతంగానే కనిపిస్తున్నాయి. తటస్థ వేదిక కావడంతో ఆసక్తిగా అనిపిస్తోంది. ఇంగ్లాండ్‌లో బంతి బాగా స్వింగ్‌ అవుతుంది. కివీస్‌లో సౌథీ, బౌల్ట్‌, జేమీసన్‌ వంటి నాణ్యమైన పేసర్లు ఉన్నారు. ఇక భారత్‌, కివీస్‌ రెండు జట్లలోనూ తిరుగులేని బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. క్రికెట్‌ ద్వారా భారత్‌ భారీ ఆదాయం ఆర్జిస్తోంది. అందుకే టీమ్‌ఇండియా లేకుంటే ప్రపంచ క్రికెట్‌ ముఖ చిత్రం భిన్నంగా ఉండేది. ఆసీస్‌ చేతిలో 36కే ఆలౌటైనా సిరీస్‌ గెలిచి టెస్టు క్రికెట్‌ను బతికించింది. కుర్రాళ్లు అదరగొట్టారు. భారత్‌లో అన్ని ఫార్మాట్లలో ఆడగల ప్రతిభావంతులు  ఉన్నారు’ అని హెడ్లీ అన్నారు.

అత్యున్నత స్థాయి క్రికెట్లో ప్రతి జట్టూ హోరాహోరీగా పోటీపడతాయని హెడ్లీ తెలిపారు. విజయం కోసం ప్రత్యర్థి జట్లపై రకరకాల వ్యూహాలు అమలు చేస్తాయని పేర్కొన్నారు. ఏం చేసినా క్రీడాస్ఫూర్తి గీత దాటకుంటే బాగుంటుందన్నారు. టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి అంకితభావం ఎక్కువన్నారు. మ్యాచులో తీవ్ర పోటీనిస్తాడని పేర్కొన్నారు. జట్టుకు విజయం అందించేందుకు తీవ్రంగా స్పందిస్తాడన్నారు. అతడో ప్రపంచస్థాయి క్రికెటరని, ప్రతి మ్యాచును గెలిపించాలన్న అంచనా, ఒత్తిడి అతడిపై ఉంటాయన్నారు. కోట్లమంది అతడిని ఆరాధిస్తున్నారని వెల్లడించారు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net