పైలట్‌కు కాంగ్రెస్‌ తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి
close

తాజా వార్తలు

Published : 16/07/2020 03:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పైలట్‌కు కాంగ్రెస్‌ తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి అవినాశ్‌ పాండే

జైపుర్‌: కాంగ్రెస్‌ తిరుబాటు నేత సచిన్‌ పైలట్‌కు ఇంకా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యులు అవినాశ్‌ పాండే అన్నారు. తాను భాజపాలో చేరట్లేదని సచిన్‌ పైలట్‌ ప్రకటించిన కాసేపటికే అవినాశ్‌ పాండే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘సచిన్‌ పైలట్‌కు కాంగ్రెస్‌ ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాయి. తన తప్పును తెలుసునేలా భగవంతుడు అతనికి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. భాజపా వల నుంచి ఆయన బయటపడతారని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు. 

ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత సచిన్‌ పైలట్‌ భాజపాలో చేరనున్నారనే ఊహాగానాలు భారీ ఎత్తున వినిపించాయి. వీటిపై స్పందించిన ఆయన.. తాను భాజపాలో చేరడం లేదని ఈరోజు ఉదయం స్పష్టం చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. 

తిరుగుబావుటా ఎగరేసి వరుసగా రెండు సార్లు సీఎల్పీ భేటీకి హాజరుకాకపోవడంతో సచిన్‌ పైలట్‌ను ఉపముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కాంగ్రెస్‌ తొలగించిన విషయం తెలిసిందే. ఆయనకు సన్నిహితులైన మంత్రులు విశ్వేంద్రసింగ్‌, రమేష్‌ మీనాకూ ఉద్వాసన పలికింది. ఆ వెంటనే స్పందించిన భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియా, ఆ పార్టీ ఎంపీ ఓం మాధుర్‌ వంటివారు పైలట్‌పై సానుభూతి కురిపించారు. పార్టీ సిద్ధాంతంపై విశ్వాసం ఉన్నవారికి భాజపా తలుపులు తెరిచే ఉంటాయని కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, రాజస్థాన్‌కు చెందిన పలువురు సీనియర్‌ నేతలు పేర్కొంటూ పరోక్షంగా సచిన్‌ను పార్టీలోకి ఆహ్వానించారు.

ఇదీ చదవండి..

సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్‌ వేటుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని