close

తాజా వార్తలు

Published : 20/07/2020 23:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సులేమానీ సమాచారం చేరవేసిన వ్యక్తికి మరణశిక్ష!

టెహ్రాన్‌: అమెరికా సైన్యం దాడిలో మరణించిన ఇరాన్ అగ్రశ్రేణి సైనికాధికారి జనరల్‌ సులేమానీపై గూఢచర్యం నెరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మరణశిక్ష విధించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ ఐఆర్‌ఐబీ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. నిందితుడు మహమ్మద్‌ మౌసావీ-మాజిద్‌పై ఉన్న ఆరోపణల్ని ధ్రువీకరిస్తూ గత నెల అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అయితే, సులేమానీ మరణంతో ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సులేమానీ కదలికలపై అమెరికా, ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలకు సమాచారం అందజేస్తున్నారన్న ఆరోపణలతో  2018లోనే అతణ్ని అరెస్టు చేశారు. 

ఇరాన్‌లో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో మాజిద్‌కు మరణ శిక్ష అమలు చేయడం చర్చనీయాంశంగా మారింది. నిరసనకారుల్ని భయపెట్టడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ముగ్గురు వ్యక్తులకు కోర్టు మరణశిక్ష విధిస్తూ గత నెల తీర్పు వెలువరించింది. దీన్ని నిరసిస్తూ ప్రజలు భారీ ఎత్తున నిరసన తెలిపారు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం వారికి మరణశిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయినా, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.