close

తాజా వార్తలు

Published : 27/02/2021 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. సాగరం..గరం

పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు తెరలేవడంతో అందరి దృష్టీ నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికపైకి మళ్లింది. ఈ ఎన్నిక షెడ్యూలు వెలువడుతుందని భావిస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి పెరుగుతోంది. తెరాస సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాలియా బహిరంగసభతో తెరాస ఎన్నికల ప్రచారానికి నాంది పలికారు. అక్కడి నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కె.జానారెడ్డి మరోమారు బరిలో నిలవడానికి సిద్ధమై ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

దిన పత్రికంత బ్యాలెట్‌ పత్రం

2. ఎత్తు తగ్గిద్దామా!

పోలవరం ప్రాజెక్టు ముంపును తగ్గించడానికి ఎత్తు తగ్గించేందుకు ఉన్న అవకాశాలపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసినట్లు తెలిసింది. ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎంత ఎత్తు తగ్గిస్తే ఎంత ముంపును నివారించడానికి అవకాశముందన్న అంశంపై కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ తదితర సంస్థలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. కనీస నీటిమట్టం 41.15 ఎత్తు మీటర్ల నుంచి 38.05 మీటర్లకు తగ్గించడం, దీనికి తగ్గట్టు పూర్తి స్థాయి నీటిమట్టాన్ని తగ్గించడం వల్ల ముంపుతోపాటు నిర్మాణ వ్యయాన్నీ నియంత్రించవచ్చనే ఓ ప్రతిపాదన కేంద్ర జల్‌శక్తి శాఖ ముందుకు రావడంతో.. దీనిపై ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసి చర్చించినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రెండేళ్లు అపరిమిత కాల్స్‌ రూ.1999కే

రెండేళ్ల పాటు అపరిమిత కాల్స్‌, నెలకు అధికవేగం 2 జీబీ డేటా.. తదుపరి పరిమితవేగంతో అపరిమిత డేటా, సరికొత్త జియోఫోన్‌ కూడా కలిపి రూ.1999కి ఇవ్వనున్నట్లు రిలయన్స్‌ జియో శుక్రవారం ప్రకటించింది.  ఇవే సదుపాయాలు ఏడాది కాలావధికి కావాలనుకుంటే రూ.1499 చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. ‘కొత్త జియోఫోన్‌ 2021’ కింద ప్రకటించిన ఈ ఆఫర్‌ మార్చి 1 నుంచి రిలయన్స్‌ రిటైల్‌, జియో రిటైలర్ల వద్ద అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వనస్థలిపురంలో కారు బీభత్సం

 వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురంలో ఈరోజు తెల్లవారు జామున కారు బీభత్సం సృష్టించింది. గౌతమ్‌ అనే యువకుడు మద్యం మత్తులో కారు నడిపి ట్రాఫిక్‌ సిగ్నల్‌ స్తంభాన్ని ఢీకొట్టాడు. అనంతరం డివైడర్‌ పై నుంచి మరో పక్కకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సందీప్‌ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు పరారయ్యాడు. కారు నడిపిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ట్రాఫిక్‌ నేరాలపై ఎలక్ట్రానిక్‌ నిఘా

5. వాకిలే పాఠశాల.. రూపాయికే చదువు!

వయసు మీద పడ్డాక ఎవరైనా ఏం చేయాలనుకుంటారు? ఇంట్లోనే సేద తీరుతూ మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేయాలనుకుంటారు.. అంతేకదా..? బిహార్‌కు చెందిన లోకేష్‌ శరణ్‌ మాత్రం అందుకు మినహాయింపు! ఉపాధ్యాయుడిగా ఎంతోమంది చిన్నారుల మెరుగైన భవిష్యత్తుకు బాటలు పరిచిన ఆయన.. 61 ఏళ్ల వయసులోనూ ఆ పనిని కొనసాగిస్తున్నారు. ఒకే ఒక్క రూపాయిని ఫీజుగా తీసుకుంటూ పేద విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. సమస్తీపుర్‌కు చెందిన లోకేష్‌ బీఎడ్‌ పూర్తిచేశారు. తన తండ్రి ఏర్పాటుచేసిన పాఠశాలలోనే ఆయన చాలాకాలం పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అన్నివైపులా అమ్మకాలు

కొవిడ్‌ ఒడిదొడుకులు తట్టుకుని.. ధరణి అడ్డంకుల్ని అధిగమించి.. పెరుగుతున్న భూముల ధరలతో పోటీపడుతూ ప్రస్తుతం స్థిరాస్తి రంగం పరుగులు పెడుతోంది. కొత్త సంవత్సరంలో లావాదేవీలు వేగం అందుకున్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గడంతో స్థిరాస్తుల్లో పెట్టుబడి పెడుతున్నవారు పెరిగారు. ఇలాంటివారు స్థలాలు కొనుగోలు చేస్తుంటే.. గృహరుణ వడ్డీరేట్లు తగ్గడంతో రుణాలు తీసుకుని అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో సిద్ధంగా ఉన్న ఇళ్లు, కొత్త ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు, వెంచర్లలో స్థలాలు హాట్‌ కేకుల్లా బుకింగ్‌లు అవుతున్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రాణం అనుకున్నా.. ప్రాణమే తీస్తోంది

నాకు పదిహేనేళ్లప్పుడు మొదటిసారి మహి (పేరు మార్చాం)ని చూశా. చదువు, అందం.. రెండింట్లోనూ టాప్‌ తను. ఎన్ని కష్టాలున్నా నేను ఏదైనా సాధించగలను అనేది. ఆ ఆత్మవిశ్వాసానికే ఫిదా అయిపోయా.
స్కూలు దాటి కాలేజీకొచ్చాం. మేం మాట్లాడుకుంది తక్కువే. రోజులు గడిచేకొద్దీ తనపై ఇష్టం కొండలా పెరిగిపోయేది. మరోవైపు నాపై తన ఫీలింగ్‌ ఏంటో తెలియదు. ఇంట్లోవాళ్లు తనకి సడెన్‌గా పెళ్లి ఫిక్స్‌ చేశారనే వార్త తెలిసింది. నా గుండె పగిలిపోయింది. కడసారి చూడాలని పెళ్లికెళ్లా. నన్ను చూసింది. ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటోంది. నాలాగే. నాకర్థమైంది. తన మనసులో నా స్థానమేంటో. తిరిగొచ్చేశా. ఆరోజు నుంచి రోజూ నరకమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆ కండల వెనక కన్నీటి గాథ

8. అమ్మా.. నాన్న.. అన్న... అన్నీ ఆమె!

పురుషుడిగా.. మహిళగా.. అమ్మాయిగా.. ఎలా కావాలంటే అలా అప్పటికప్పుడు గొంతు మార్చేసి మాట్లాడుతుంది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి నిమిషాల్లో ఖాతాలు ఖాళీ చేసేస్తుంది. స్వాతి.. అర్చన.. జూటూరి వరప్రసాద్‌.. జూటూరి ఇందిరా ప్రియదర్శిని.. పుష్యతి... ఇలా రకరకాల పేర్లతో ఎంతోమంది ఎన్‌ఆర్‌ఐలకు టోపీ పెట్టిన మాయ‘లేడీ’ని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు కటకటాల్లోకి పంపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆస్కార్‌ బరిలో ‘సురారై పొట్రు’

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారాల సందడి మొదలుకానుంది. ఏప్రిల్‌లో జరగనున్న 93వ ఆస్కార్‌ పురస్కార్‌ వేడుకల్లో భాగంగా ఉత్తమ చిత్రంగా నామినేషన్‌ దక్కించుకున్న 366 చిత్రాలను ఆస్కార్‌ అకాడెమీ ప్రకటించింది. ఇందులో సూర్య నటించిన తమిళ చిత్రం ‘సురారై పొట్రు’కి స్థానం దక్కింది. ఎయిర్‌ డెక్కన్‌ అధినేత గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా సుధ కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒడిశా చిత్రం ‘కలిర అటిత’ కూడా ఈ జాబితాలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దిగ్గజ పథంలో..

‘‘ఇప్పటి నుంచి అశ్విన్‌ను దిగ్గజమని పిలుస్తా. అతను ఈ తరం క్రికెట్‌ దిగ్గజం’’.. ఇవీ ప్రపంచ టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 400 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించిన తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్న మాటలు. ఆ వ్యాఖ్యల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అవును.. భారత స్పిన్నర్‌ అశ్విన్‌ దిగ్గజంగా మారుతున్నాడు. అనిల్‌ కుంబ్లే తర్వాత దేశంలో అత్యుత్తమ స్పిన్నర్‌గా ఎదిగే దిశగా సాగుతున్నాడు. ఓ దశలో జట్టులో చోటు ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో.. తనను తాను మార్చుకుని సరికొత్తగా బరిలో దిగి నిలకడైన బౌలింగ్‌తో రికార్డులు కొల్లగొడుతున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని