మధ్యాహ్నానికి 10 రాష్ట్రాల్లో పోలింగ్‌ సరళి ఇలా..
close

తాజా వార్తలు

Updated : 03/11/2020 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మధ్యాహ్నానికి 10 రాష్ట్రాల్లో పోలింగ్‌ సరళి ఇలా..

దిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో 54స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 28స్థానాలు కేవలం ఒక్క మధ్యప్రదేశ్‌లోనే ఉండటం, అక్కడ అధికార భాజపాకి కీలకంగా మారింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రశాంతంగా ఓటింగ్‌ కొనసాగుతోంది. అన్ని పోలింగ్‌ బూత్‌లవద్ద థర్మల్ స్క్రీనింగ్‌, పీపీఈ కిట్లు ధరించిన సిబ్బందితోపాటు శానిటైజర్లు ఏర్పాటు చేయడం, ఓటర్లు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, నాగాలాండ్‌ మినహా మిగతా రాష్ట్రాల్లో ఓటింగ్‌ సాయంత్రం ఆరుగంటల వరకు జరుగుతుంది. బిహార్‌తోపాటు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ సంఖ్యలో తరలిరావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లకు సూచించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు, హరియాణాలో ఒకటి...
ఉత్తర్‌ప్రదేశ్‌లో 7 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇక్కడ 29.27శాతం పోలింగ్‌ నమోదైంది. రాష్ట్ర మంత్రిగా ఉన్న చేతన్‌ చౌహాన్‌ కరోనా వైరస్‌ కారణంగా మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం ఆయన భార్య సంగీత చౌహాన్‌ ఎన్నికల్లో నిలబడ్డారు. ఇక ఉన్నావ్‌ రేప్‌ కేసులో దోషిగా తేలిన కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ జైలు శిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ స్థానంలోను ఉప ఎన్నిక జరుగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో తొలిసారిగా ఆజాద్‌ సమాజ్‌ పార్టీ బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. హరియాణాలో ఈ ఉదయం ఓటింగ్‌ కాస్త మందకొడిగా సాగినప్పటికీ ప్రస్తుతం 1గంట వరకు ఇక్కడ 34.67శాతం పోలింగ్‌ నమోదైంది.

మధ్యప్రదేశ్‌లో 28స్థానాల్లో కీలక ఎన్నికలు..
మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 27 కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానాలే కావడం విశేషం. అయితే, కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన 25మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ప్రస్తుతం భాజపా తరపున తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరో ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అనారోగ్య కారణాల వల్ల చనిపోవడంతో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 1గంట వరకు 42.71శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

గుజరాత్‌లో ఎనిమిది స్థానాల్లో..
గుజరాత్‌లోనూ ప్రస్తుతం ఎనిమిది స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అనంతరం వారిలో ఐదుగురు భాజపాలో చేరారు. దీంతో ఆ స్థానాల్లో ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతోంది. 1గంట వరకు 35.66శాతం పోలింగ్‌ నమోదైంది.

కర్ణాటక, ఝార్ఖండ్‌, నాగాలాండ్‌, ఒడిశా రాష్ట్రాల్లో రెండు చొప్పున అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతుండగా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఒక్కొక్క స్థానంలో ఉప ఎన్నిక జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతోన్న ఎన్నికల ఓటింగ్‌ శాతం ఇలా ఉంది (కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు)..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని