close

తాజా వార్తలు

Published : 10/10/2020 02:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పుజారాకి డబుల్‌ స్పెషల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి శుక్రవారంతో పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా గత దశాబ్ద కాలంలో తనకి మద్దతుగా నిలిచిన అభిమానులకు ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘భారత క్రికెటర్‌గా పదేళ్లు పూర్తిచేయడం ఎంతో విశేషం, ఆశీర్వాదం. మా నాన్న పర్యవేక్షణలో.. రాజ్‌కోట్‌లో క్రికెటర్‌గా ఎదిగిన నేను ఈ స్థాయికి చేరుతానని ఊహించలేదు. ఇన్నేళ్లుగా నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. భవిష్యత్తులో జట్టు కోసం మరింత పోరాడతా’’ అని పుజారా ట్వీటాడు. అయితే ఈ రోజు తన జీవితంలో మరో ప్రత్యేకమైందని నయావాల్‌ మరో ప్రకటనలో తెలిపాడు. తన సతీమణి పూజా పుట్టినరోజు కూడా ఈ రోజేనని, కాబట్టి ఎంతో ప్రత్యేకమైన అక్టోబర్‌ 9ని ఎన్నటికీ మరవలేనని అన్నాడు.

సుదీర్ఘ ఫార్మాట్‌ స్పెషలిస్ట్‌ అయిన‌ పుజారా జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ వచ్చే అతడు ఇప్పటివరకు భారత్‌ తరఫున 77 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 48.67 సగటుతో 5840 పరుగులు చేశాడు. 8 ద్విశతకాలు, 18 శతకాలు, 25 అర్ధశతకాలు సాధించాడు. బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన అరంగేట్ర టెస్టులోనే రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2018లో ఆసీస్‌పై కోహ్లీసేన 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. పుజారా 500కు పైగా పరుగులు సాధించి ఈ చారిత్మక విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.