
తాజా వార్తలు
TS కరోనా : 1269 కేసులు.. 8 మరణాలు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో (ఈ రోజు సాయంత్రం ఐదు వరకు) రాష్ట్రవ్యాప్తంగా 1,269 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,671కి చేరింది. గత 24 గంటల్లో 8,153 పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు 1,70,324 పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 11,883 మంది వైద్యం తీసుకుంటున్నారు. ఈ రోజు డిశ్ఛార్జి అయిన 1,563 మందితో కలిపి ఇప్పటివరకు 22, 482 మంది డిశ్ఛార్జి అయ్యారు. కొవిడ్‌తో రాష్ట్రంలో 356 మంది చనిపోగా.. అందులో ఈ రోజు మృతి చెందింది ఎనిమిది మంది.
ఈ రోజు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ నుంచి 800 కేసులు రాగా, రంగారెడ్డి జిల్లా నుంచి 132, మేడ్చల్ నుంచి 94 కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల వారీగా కేసుల వివరాలివీ...
Tags :