ది పాన్‌ స్టూడియో.. 150 రకాల కిళ్లీలు
close

తాజా వార్తలు

Published : 24/02/2021 11:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ది పాన్‌ స్టూడియో.. 150 రకాల కిళ్లీలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కిళ్లీ.. భారత సంస్కృతిలో ఓ భాగం. భోజనం తర్వాత కిళ్లీ లేకపోతే ఏదో వెలితిగా భావించేవారు చాలా మందే ఉంటారు. ఇంతగా ప్రజలు ఆదరించే పాన్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ ఒకే చోట లభించడమంటే చాలా కష్టం. కానీ వాటన్నింటినీ ఒకే చోట అందించే ప్రయత్నం చేసింది కర్ణాటకకు చెందిన ‘ది పాన్‌ స్టూడియో’. పాన్‌ ప్రియులకు ప్రత్యేకమైన అనుభూతి అందించేందుకు బెంగళూరులోని ఫేజర్‌ టౌన్‌కు చెందిన మతీన్‌ సయ్యద్‌ ఖలీల్‌ సోదరులు ఈ కేఫ్‌ను ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు.

దేశ వ్యాప్తంగా ఉండే కిళ్లీ ఫ్లేవర్లను ఇక్కడ రుచి చూడొచ్చు. పాన్‌, పాన్‌ చాక్లెట్లు, పాన్‌ ఫ్లేవర్డ్‌ డ్రై ఫ్రూట్స్‌, నేచురల్‌ టీ వంటి 150 రకాల పాన్‌ ఫ్లేవర్లు ‘ది పాన్‌ స్టూడియో’లో లభిస్తాయి. వీటిలో 50 రకాలు సాదా పాన్‌లు కాగా.. మరో 100 ఇతర సహజ ఫ్లేవర్లు. వీటిల్లో టోబ్లెరోన్‌, చాక్లెట్‌, కాఫీ, కేసరి, పుదీనా వంటివి  ఉన్నాయి. ఫ్లేవర్‌ ఆధారంగా ఒక్కో కిళ్లీ ధర రూ.50 నుంచి రూ.150 వరకు ఉంటుంది. ఈ కేఫ్ వంద శాతం పొగాకు రహితమైంది. ఇది కిల్లీ ప్రేమికులకు ఓ గొప్ప అనుభూతి అందిస్తుందన్న నిర్వాహకులు ఇటువంటి స్టూడియో ప్రారంభించడం దేశంలో ఇదే తొలిసారి కావచ్చని అన్నారు. ఈ కేఫ్‌ కొత్త అనుభూతిని ఇస్తోందని వినియోగదారులు పేర్కొంటున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని