16మంది నక్సలైట్ల లొంగుబాటు
close

తాజా వార్తలు

Published : 31/01/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

16మంది నక్సలైట్ల లొంగుబాటు

వెల్లడించిన దంతెవాడ ఎస్పీ

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో శనివారం 16 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఇద్దరిపై లక్ష చొప్పున రివార్డులు ఉన్నట్లు వారు తెలిపారు. నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ‘లోన్‌ వర్రాటు’ అనే పునరావాస కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా శనివారం 16 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ తెలిపారు. వారు ఆచరించే ‘హాలో’ భావజాలంపై అసంతృప్తిగా ఉన్నట్లు వారు వెల్లడించారన్నారు. గతేడాది ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకూ 288 నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి వచ్చారని ఆయన తెలిపారు.

లొంగిపోయిన నక్సలైట్లకు తక్షణ సాయంగా రూ. పదివేల రూపాయలు అందించామని ఎస్పీ తెలిపారు. వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని అదనపు సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఈ పునరావాస కార్యక్రమంలో భాగంగా వారికి నైపుణ్య శిక్షణ అందిస్తామని ఆయన వెల్లడించారు. లోన్‌ వర్రాటు కార్యక్రమాన్ని ప్రచారం చేసేందుకు నక్సలైట్లకు చెందిన అన్ని గ్రామాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి..

చలానా గాళ్‌ఫ్రెండ్‌ది.. కార్డేమో భార్యది..

మా ప్రభుత్వం ఫోన్‌ కాల్‌ దూరంలోనే: మోదీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని