ఇంటి నుంచి పారిపోయిన బాలికపై అత్యాచారం
close

తాజా వార్తలు

Updated : 15/10/2020 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటి నుంచి పారిపోయిన బాలికపై అత్యాచారం

ఒడిశా బాలిక అపహరణ, అత్యాచారం

కటక్‌: తల్లిదండ్రులపై అలిగి ఇంటి నుంచి పారిపోయిన మైనర్‌ బాలిక దుండగులకు చిక్కి నరకం అనుభవించింది. ఇంటికి చేరుస్తామని నమ్మించి ఆమెను అపహరించిన దుండగులు 22 రోజుల పాటు లైంగిక దాడిని సాగించిన ఘోర సంఘటన ఇటీవల ఒడిశాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

జగత్సింగ్‌పూర్‌ జిల్లా తిర్తాల్‌ గ్రామానికి చెందిన ఓ బాలిక గత నెల తన తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి పారిపోయింది. కటక్‌కు చేరిన ఈ బాలిక.. మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లేందుకు బస్సు‌ కోసం వేచిచూడసాగింది. ఇంతలో ఓ వ్యక్తి ఇంటి వద్ద దింపేస్తానంటూ నమ్మించి ఆమెను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు. అయితే బాలికను తిర్తాల్‌కు తీసుకెళ్లకుండా గతిరౌత్‌పట్నా గ్రామంలోని ఓ కోళ్లఫారానికి తీసుకెళ్లి నిర్బంధించాడు. అక్కడ అతను, మరో వ్యక్తి తనపై 22 రోజుల పాటు  అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. అక్కడి కదలికలపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో వారు వచ్చి బాలికను రక్షించారు. ఆమెను తొలుత శిశు సంక్షేమ గృహానికి, అనంతరం అనాథ శరణాలయానికి తరలించారు. 

ఈ కేసుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నామని.. రెండో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా, ఈ సంఘటనపై  ఒడిశాలో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం మహిళల రక్షణలో విఫలమైందని భాజపా జనరల్ సెక్రటరీ లేఖశ్రీ సామంత్‌ సింఘార్‌ విమర్శించారు.  ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించి బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్‌ నేత నిశికాంత్‌ మిశ్రా డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని