యూపీలో మరో దారుణం.. 18 ఏళ్ల యువతిపై..
close

తాజా వార్తలు

Updated : 17/10/2020 05:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీలో మరో దారుణం.. 18 ఏళ్ల యువతిపై..

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో హాథ్రస్‌ తరహా ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. 19 ఏళ్ల దళిత యువతిపై హత్యాచారంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన కొద్దిరోజులకే బారాబంకిలో మరో దారుణం చోటుచేసుకుంది. 18 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమె గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. బుధవారం వ్యవసాయక్షేత్రానికి వెళ్లిన కుమార్తె తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా ఆమె అక్కడ రక్తపుమడుగులో పడిఉంది. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా హత్య చేసే ముందు దుండగులు ఆమెపై అత్యాచారం చేసినట్లుగా వైద్యులు నిర్ధరించారు. పోలీసు సూపరింటెండెంట్ ఆర్ ఎస్‌ గౌతమ్‌ మాట్లాడుతూ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని