close

తాజా వార్తలు

Published : 08/07/2020 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో మరోసారి భారీగా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి భారీగా కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1879 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1422 కేసులు వచ్చినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇవాళ మరో ఏడుగురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,612కి చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 313కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,220 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,341 మందికి నెగిటివ్‌గా తేలింది. ఇవాళ మరో 1506 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం 11,012 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.

92.2 శాతం బెడ్లు అందుబాటులో..

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 17,081 పడకలు అందుబాటులో ఉన్నాయని, అందులో కేవలం 7.8 శాతం బెడ్లు మాత్రమే ప్రస్తుతానికి వినియోగంలో ఉన్నాయని తెలంగాణ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అందులో 11,928 ఐసోలేషన్‌ బెడ్స్‌ కాగా.. 3,537 ఆక్సిజన్‌ బెడ్స్‌, 1616 ఐసీయూ బెడ్స్‌ ఉన్నట్లు తెలిపింది. ఒక్క గాంధీ ఆస్పత్రిలో మొత్తం 1890 పడకలు ఉండగా.. 130 మంది ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని