Corona: బెంగళూరులో భారీగా కేసులు! 
close

తాజా వార్తలు

Updated : 28/04/2021 20:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: బెంగళూరులో భారీగా కేసులు! 

బెంగళూరు: కరోనా మహమ్మారి విజృంభణతో కర్ణాటక చిగురుటాకులా వణుకుతోంది. బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా వైరస్‌ వ్యాప్తి ఆగడంలేదు. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా బుధవారం ఒక్కరోజే గతంలో ఎన్నడూ లేనంతగా కొత్త కేసులు వచ్చాయి. గడచిన 24గంటల వ్యవధిలోనే 39వేలకు పైగా కొత్త కేసులు, 229 మరణాలు నమోదయ్యాయి. వీటిలో ఒక్క బెంగళూరు నగరంలోనే 22,596 కొత్త కేసులు వెలుగుచూడటం గమనార్హం. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా మరో 11,833 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.  రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన తాజా గణాంకాలతో కలుపుకొంటే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 14,39,822కి చేరాయి. వీరిలో 10,95,883 మంది కోలుకోగా..15,036మంది మృతిచెందారు. ప్రస్తుతం 3,28,884 క్రియాశీల కేసులు ఉన్నాయి.  వీటిలో బెంగళూరు నగరంలోనే దాదాపు 2లక్షలు కేసులు ఉన్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా మంగళవారం రాత్రి నుంచి 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ తరహా కర్ఫ్యూ అమలు జరుగుతున్న విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని