ఏపీలో ఒక్కరోజే 44 మంది మృతి
close

తాజా వార్తలు

Updated : 15/07/2020 16:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో ఒక్కరోజే 44 మంది మృతి

అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం చూపుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,432 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధిక సంఖ్యలో 44 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 35,451కి చేరగా.. మరణాల సంఖ్య 452కి పెరిగింది. తాజాగా నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందిన వారిలో 2,412 మందికి పాజిటివ్‌గా తేలగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 20 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున మరణించారు. కర్నూలులో 5, చిత్తూరు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో నలుగురేసి, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. 24 గంటల్లో 22,197 శాంపిళ్లు పరీక్షించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12,17,963 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 14,059 మంది ఆస్పత్రుల్లో, 2,562 మంది కొవిడ్‌ సెంటర్లలో కలిపి 16,621 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని