ఈ రాష్ట్రానికి ఏమైంది.. 
close

తాజా వార్తలు

Published : 22/10/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ రాష్ట్రానికి ఏమైంది.. 

ఇద్దరు మైనర్లు.. ఓ చిన్నారిపై దారుణం

లఖ్‌నవూ : ఉత్తరప్రదేశ్‌లో మహిళలు, మైనర్లు, పసికందులు.. ఇలా మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మూడు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మైనర్లు, ఓ మూడేళ్ల చిన్నారిపై తెలిసిన వారే అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందులో మైనర్‌ను, చిన్నారిని హత్య చేశారు. 

యూపీ రాజధాని లఖ్‌నవూకు సమీపంలో ఉన్న బారాబంకీ జిల్లాలో 17 ఏళ్ల మైనర్‌పై పలువురు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ మైనర్‌, ఓ యువకుడు ప్రేమించుకోవడం తెలిసిన బాలిక తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆ అమ్మాయి యువకుడిని కలిసేందుకు నిరాకరించింది. దీంతో బాలికపై కోపం పెంచుకున్న యువకుడు తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. అనంతరం మైనర్‌ను హత్య చేసి కాలువలో పడేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా తనే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. 

దిల్లీకి సమీపంలో ఉన్న యూపీలోని ఓ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు 14 ఏళ్ల మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత బాలిక కడుపునొప్పితో బాధపడుతుండటంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ రాష్ర్టంలోని ఘజియాబాద్‌ జిల్లాలో మూడేళ్ల పసికందుపై ఆ చిన్నారి తండ్రి స్నేహితుడు మంగళవారం దారుణానికి ఒడిగట్టాడు. పాపను ఆడిస్తానని తల్లి దగ్గరి నుంచి తీసుకెళ్లిన 32 ఏళ్ల వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేసి, చంపేశాడు. పని మీద వెళ్లి ఇంటికి వచ్చిన పాప తండ్రి తన స్నేహితుడికి ఫోన్‌ చేయగా స్విఛాఫ్‌ వచ్చింది. ఎంతసేపటికి చిన్నారి ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిని వెతుకుతుండగా పోలీసులను చూసి దాక్కున్న అతడిని అరెస్టు చేశారు. శవపరీక్షలో చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధరించారు. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ర్ట సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ వారం కిందట స్ర్తీల భద్రతకు సంబంధించి ‘మిషన్‌ శక్తి’ అనే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అయినా అఘాయిత్యాలకు తెరపడటం లేదు. 

 


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని