Third Wave అన్ని చోట్లా వస్తుందా?
close

తాజా వార్తలు

Published : 08/05/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Third Wave అన్ని చోట్లా వస్తుందా?

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా రెండోదశ వ్యాప్తి అలజడి సృష్టిస్తోంది. వేలాది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా మూడోదశ వ్యాప్తి (థర్డ్‌ వేవ్‌) ముప్పు కూడా పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ప్రజల్లో భయం పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్‌ వేవ్‌ కూడా ఇప్పుడున్నంత తీవ్రంగా ఉంటుందా? దేశవ్యాప్తంగా థర్డ్‌ వేవ్‌ తప్పదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇలాంటి ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వ సాంకేతిక ముఖ్య సలహాదారు విజయరాఘవన్‌  సమాధానమిచ్చారు. దేశంలో థర్డ్‌ వేవ్‌ అనివార్యమని, దానిని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని గత బుధవారం  చెప్పిన ఆయన అదే అంశంపై మరింత వివరణ ఇచ్చారు. థర్డ్‌ వేవ్‌ దేశంలో వస్తుందనీ, అయితే అన్ని ప్రాంతాల్లో దాని ప్రభావం కనిపించకపోవచ్చని ఆయన అన్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడున్నంత తీవ్రత ఉండకపోవచ్చన్నారు. ‘‘అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మూడో దశ వ్యాప్తి ఉండకపోవచ్చు. ఒక వేళ ఉన్నా అంత తీవ్రత ఉండదు. ఇప్పటిలాగే ఒక్కో చోట తీవ్రత ఒక్కోలా ఉంటుంది’ అని ఆయన వివరణ ఇచ్చారు.

‘కరోనా దశల వారీగా వ్యాప్తి చెందుతుందా? ఎన్ని దశలు ఉంటాయి?’ లాంటి విషయాలు కాకుండా వైరస్‌ తీవ్రతను, దానిని తగ్గించుకునే మార్గాలను గురించి మాట్లాడుకుంటే ఉపయోగముంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మూడో దశ వ్యాప్తి అన్ని చోట్లా  ఉండకపోవచ్చని, అలాగని నిర్లక్ష్యం చేయకూడదని విజయరాఘవన్‌ హెచ్చరించారు. ఆయా రాష్ట్రాల్లో మార్గదర్శకాల అమలు,  స్థానిక పరిస్థితులు, అధికారుల సమన్వయం, ప్రజల సహకారంపై మూడోదశ తీవ్రత  ఆధారపడి ఉంటుందన్నారు. ‘‘వైరస్ వ్యాప్తి అనివార్యమైనప్పటికీ కట్టుదిట్టంగా మార్గదర్శకాలను ఆమలు చేస్తే దానిని అడ్డుకోవచ్చు. అలా చేయడం కొంచెం కష్టమే..కానీ చేయొచ్చు’’అని రాఘవన్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని