close

తాజా వార్తలు

Published : 15/04/2021 22:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బెంగాల్‌లో ఒకేదశలో ఎన్నికలపై ఈసీ క్లారిటీ!

పునరాలోచించాలన్న మమతా బెనర్జీ

కోల్‌కతా: కరోనా వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా పశ్చిమ బెంగాల్‌లో మరో నాలుగు దశల్లో జరుగనున్న ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని.. ముందుగా నిర్దేశించిన ప్రకారమే నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే నాలుగు దశల్లో 135 స్థానాలకు ఎన్నికలు పూర్తికాగా, మిగతా 159 స్థానాలకు మరో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇదే సమయంలో దేశంలో కరోనా వైరస్‌ రెండోదఫా ఉద్ధృతితో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ సమయంలో బెంగాల్‌లో మరో నాలుగు దశల్లో జరగాల్సిన ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారనే ప్రచారం మొదలయ్యింది. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం..ప్రస్తుతానికి అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించడంపై ఈసీపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మిగతా నాలుగు దశల్లో నిర్వహించాల్సిన ఎన్నికలను ఒకేసారి చేపట్టే విధంగా ఎన్నికల సంఘం ఆలోచన చేయాలని ట్విటర్‌లో పేర్కొన్నారు. తద్వారా ప్రజలను కరోనా బారినపడకుండా రక్షించవచ్చని సూచించారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని