close

తాజా వార్తలు

Published : 14/07/2020 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తమిళనాడులో ఒక్కరోజే 66 మంది మృతి 

చెన్నై: తమిళనాడులో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,328 మంది కరోనా బారిన పడ్డారు. మరో 66 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అదే సమయంలో 3,035 మంది ఆస్పత్రి నుంచి కోలుకున్నారని హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,42,798కి చేరింది. మరణాల సంఖ్య 2,032కి పెరిగింది. ఇప్పటి వరకు 92,567 మంది కోలుకోగా.. 48,196 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు కేసుల పెరుగుదల నేపథ్యంలో బస్సు సర్వీసులను ఈ నెల 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. తొలుత ఈ నెల 15 వరకు బస్సులు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. కరోనా అదుపులోకి రాని నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు బస్సు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని