
తాజా వార్తలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.97 శాతం పోలింగ్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 45.97 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్‌కుమార్ వివరాలు వెల్లడించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఎక్కువ నమోదైనట్లు లోకేష్‌కుమార్ తెలిపారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఈ సారి స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది. అయితే మొదటి నుంచి ఎన్నికల పోలింగ్ మందకొడిగానే సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 36.73 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగుస్తున్న సమయంలో ఓటింగ్ ఎక్కువగా జరిగింది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడం, కరోనా భయం పోలింగ్‌పై పడింది. లేకుంటే ఇంకా ఎక్కువ శాతం పెరిగేదే. ఇక ఓల్డ్ మలక్ పేట మినహా 149 డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గురువారం ఓల్డ్‌మలక్‌పేటలో రీపోలింగ్ జరగనుంది.
గతంలో గ్రేటర్లో జరిగిన ఎన్నికల ఫలితాలు..
2002లో ఎంసీహెచ్ ఎన్నికల్లో 41.04 శాతం పోలింగ్ నమోదైంది. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 42.95 శాతం, 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతం పోలింగ్ నమోదైంది. 2014లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో 50.86 శాతం, 2018 ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో 53 శాతం పోలింగ్ నమోదైంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
- లడ్డూ కావాలా..? పంచ్ ఇచ్చిన దిశాపటాని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
